• తాజా వార్తలు
  •  

మ‌నం క్యూలో నిల‌బ‌డ‌డం ఇష్టం లేని గూగుల్ ఈ ఫీచ‌ర్ తెచ్చింది..

వినియోగ‌దారుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకు రావ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ శైలే వేరు. ఇటీవ‌లే టెజ్ పేమెంట్ యాప్‌ను తీసుకొచ్చి క‌స్ట‌మ‌ర్ల‌లో కొత్త ఒర‌వ‌డిని క్రియేట్ చేసిన ఈ సంస్థ‌...మ‌రో ఉపయోగ‌క‌రమైన యాప్‌తో ముందుకొచ్చింది. దీంతో మీరు స‌మ‌యం, శక్తి  కూడా ఆదా కానున్నాయి.  మ‌రి ఏంటా ఫీచ‌ర్‌?

రెస్టారెంట్ వెయిటింగ్ ఉండ‌దు..
మ‌నం స‌మ‌యం దొరికిన‌ప్పుడో లేదా వీకెండ్స్‌లోనూ  రెస్టారెంట్స్‌కు వెళ్ల‌డం చాలా కామన్‌. అయితే మ‌నం అన్ని రెస్టారెంట్ల‌కు వెళ్లం. కొన్ని మాత్ర‌మే మ‌న‌కు ఫేవ‌రెట్ రెస్టారెంట్లు ఉంటాయి. అయితే వాటిలో టైమ్ స్పెండ్ చేద్దామంటే ఫుల్ రెష్‌. అంద‌రూ అక్క‌డికే వ‌స్తారు. మ‌రి అక్క‌డికి వెళ్లాలంటే క‌చ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మ‌రి అంతసేపు వెయిట్ చేసే ఓపిక  అంద‌రికి ఉంటుందా?... వెంట‌నే వేరే రెస్టారెంట్‌కు వెళ్లిపోతారు.  లేదా ప్రోగ్రామ్ కూడా కాన్సిల్ చేసుకుంటారు. అయితే ఇక‌పై ఈ ఇబ్బందులు ఉండ‌వు. మీకు ఇష్ట‌మైన రెస్టారెంట్‌ల‌లో మీరు ఇబ్బంది లేకుండా  హాయిగా గ‌డ‌పొచ్చు. దీని కోసం గూగుల్ ఒక ఆప్ష‌న్ వ‌చ్చింది.  దీని ద్వారా మీ ఫేవ‌రెట్ రెస్టారెంట్లు ఏ స‌మ‌యంలో ఖాళీగా ఉన్నాయో..ఎప్పుడు మీరు వెళ్లొచ్చో అన్ని వివ‌రాలు ఉంటాయి. ఇవి ఎప్ప‌టిక‌ప్పుడు. రియ‌ల్‌టైమ్‌లో అప్‌డేట్ అవుతాయి.  దీని వ‌ల్ల మీకు  స‌మ‌యం కూడా వృథా కాదు.

గూగుల్ సెర్చ్‌లోనే..
గూగుల్ సెర్చ్ బాక్స్‌లోనే ఈ ఆప్ష‌న్‌ను తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నంలోనే ఆ సంస్థ ఉంది. మ్యాప్స్ ప‌క్క‌నే ఒక ఆప్ష‌న్‌ను ఉంచాల‌ని గూగుల్ చెబుతోంది. దీనిలోకి వెళితే  మీ ఫేవ‌రేట్ ఈటింగ్ హ్యాంగ్ అవుట్ గురించి మీరు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు. దీనిలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు  మిలియ‌న్ రెస్టారెంట్ల‌కు సంబంధించిన టైమ్ డిటైల్స్ కూడా దీనిలో ఉంటాయి. గూగుల్‌లోకి వెళ్లి  మీకు న‌చ్చిన రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుని బిజినెస్ లిస్టింగ్ సెల‌క్ట్ చేసుకోవాలి.  పాపుల‌ర్ సెక్ష‌న్‌లోకి వెళ్లి...మీ టైమింగ్‌ను సెట్ చేసుకోవాలి. ఇది ఎప్ప‌టిక‌ప్పుడు మీ ఫోన్‌కు అలెర్ట్స్ పంపిస్తుంది. దీంతో మీకు స‌మయం ఎంతో ఆదా అవుతుంది.

జన రంజకమైన వార్తలు