• తాజా వార్తలు
  •  

ఒపెరా నియాన్.. సరికొత్త కాన్సెప్ట్ బ్రౌజర్

వెబ్ బ్రౌజ‌ర్... ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది క్రోమ్‌, ఫైర్‌పాక్స్‌. ఎందుకంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌మంది వాడే బ్రౌజ‌ర్ల‌లో ఈ రెండు ముందంజ‌లో ఉంటాయి. అయితే ఇవే కాక చాలా బ్రౌజర్లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వాడ‌డం త‌క్కువ‌. అయితే క్రోమ్‌, ఫైర్‌పాక్స్ త‌ర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన బ్రౌజ‌ర్ల‌లో ఓపెరా ముందు వ‌రుస‌లో ఉంటుంది. అయితే ఒపెరా బ్రౌజర్‌ని డెస్క్‌టాప్‌కి కాక మొబైల్‌లో ఎక్కువ‌గా వాడుతుంటారు. మొబైల్ వెర్ష‌న్‌కి ఒపెరా బాగా న‌ప్పుతుంద‌నేది చాలామంది అభిప్రాయం. అయితే మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో యూజ‌ర్ల‌ను మ‌రింత ఆకర్షించానికి పోటీలో నిల‌దొక్కుకోవ‌డానికి ఒపెరా కొత్త కొత్త ఉత్ప‌త్తుల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. ఆ కంపెనీ తాజాగా ఒపెరా నియాన్ వెర్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఓపెరాతో పోలిస్తే నియాన్‌లో ఎన్నో మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి.

ఆకట్టుకునే ఎఫెక్ట్‌లు, ఎనిమేషన్లు
ఒపెరా నియాన్ వెబ్ బ్రౌజ‌ర్‌లో యూజ‌ర్ల‌ను క‌ట్టిప‌డేసే ఆప్ష‌న్లు చాలానే ఉన్నాయి. బ్లింక్ ఇంజిన్‌తో త‌యారైన ఈ బ్రౌజ‌ర్ యూజర్ల‌కు మంచి వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వెర్ష‌న్‌లో కూల్ ఎఫెక్ట్స్‌తో పాటు యానిమేష‌న్లు దీనిలో ఉన్నాయి. దీని వ‌ల్ల మ‌న వ‌ర్క్‌కు కావాల్సిన ఫీచ‌ర్ల‌ను సుల‌భంగా పొందే అవ‌కాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేస్డ్‌గా ఈ బ్రౌజ‌ర్‌ని త‌యారు చేశారు. దీనిలోఉన్న న్యూ సార్ట్ పేజీని మీ డెస్క్‌టాప్ వాల్‌పేప‌ర్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. సైడ్‌బార్‌లో వీడియో ప్లేయ‌ర్, ఇమేజ్ గ్యాల‌రీ, డౌన్లోడ్ మేనేజ‌ర్ ఉన్నాయి. బ్రౌజ‌ర్ విండో కుడి వైపు ఉన్న వ‌ర్టిక‌ల్‌, విజువ‌ల్ ట్యాబ్ ట్యాబ్స్ మ‌ధ్య అంత‌రాన్ని తెలియ‌జేయ‌డానికి ఉప‌యోగ‌పడుతుంది. వీడియో పాప‌ప్ ఔట్ ద్వారా మీరు వేరే పేజ్‌ల‌ను బ్రౌజ్ చేసిన‌ప్పుడు కూడా వీడియోలు ప్లే చేసుకోవ‌చ్చు.

విశేషాలు ఎన్నో..
ఇవి మాత్ర‌మే కాదు ఒపెరా నియోన్‌లో కొత్త త‌రానికి చేరువ‌య్యే విశేషాలు చాలా ఉన్నాయి. దీనిలో ఉన్న స్ల్పిట్ స్క్రీన్ ఆప్స‌న్ వ‌ల్ల ఒకేసారి రెండు పేజీల‌ను బ్రౌజ్ చేసే అవ‌కాశం ఉంది. బ‌బుల్ ట్యాబ్స్ మేనేజ్‌మెంట్ కూడా దీనిలో ఉంది. అదెలాగంటే.. ఒక కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ బార్లో ఉన్న ప్ల‌స్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. మీ టాప్ బార్‌కు మీ ఫేవ‌రెట్ సైట్‌ను యాడ్ చేయ‌డానికి ఆ సైట్‌ను డ్రాగ్ చేసి మీరు ఎక్క‌డ కావాల‌నుకుంటే అక్క‌డ బ‌బుల్ డ్రాప్ చేయాలి. మినిమైజ్ చేయాలంటే బుబుల్ లేదా ప్ల‌స్ ఐకాన్ క్లిక్ చేయాలి. ట్యాబ్ క్లోజ్ చేయాలంటే ఎక్స్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇవి మాత్ర‌మే కాదు యూజ‌ర్లు మెచ్చే ఎన్నో ఆప్ష‌న్లు ఒపెరా నియోన్‌లో ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు