• తాజా వార్తలు
  •  

క్రోమ్ తో పోటీకి ఫైర్ ఫాక్స్ ఏం చేస్తుందంటే..


లీడింగ్ బ్రౌజర్లలో ఒకటైన ఫైర్ ఫాక్స్ స్పీడు విషయంలో గూగుల్ క్రోమ్ కంటే బాగా వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేగంలో వెనుకబడితే ఉనికి కోల్పోవడం ఖాయామని అర్థం చేసుకున్న ఫైర్ ఫాక్స్ నిలదొక్కుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇకపై ఫైర్‌ఫాక్స్‌ ఇంటర్‌ఫేస్‌ సెట్టింగ్స్‌లో పెర్ఫార్మెన్స్‌ ట్యాబ్‌ను యాడ్‌ చేయనుంది.

మరిన్ని ఫీచర్స్
వేగవంతమైన ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ను అందించడమే ఈ ట్యాట్‌ ప్రధాన ఉద్దేశం . ఇంకా పాత వెర్షన్‌ ఓఎస్‌లు వాడుతూ తక్కువ ర్యామ్‌ను ఉపయోగించే వారికి ఈ పెర్ఫార్మెన్స్‌ ట్యాబ్‌ బాగా ఉపయోగపడుతుందని ఫైర్‌ఫాక్స్‌ చెబుతోంది. త్వరలో మరిన్ని వినూత్నమైన మార్పులు తీసుకొస్తామని ఆ సంస్థ వెల్లడించింది. తాజాగా ప్రవేశపెడుతున్న ఫెర్ఫార్మెన్స్‌ ఫీచర్‌ కచ్చితంగా ఫైర్‌ఫాక్స్‌ వాడుతున్న వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుందట.

యాడ్ ఆన్స్ రిమూవలే అసలు కిటుకు
పెర్ఫార్మెన్స్‌ ఆప్షన్‌లో ఉండే ఆప్టిమైజ్‌ ఫైర్‌ఫాక్స్‌ కొన్ని యాడ్‌ ఆన్స్‌ని అడ్డుకుని బ్రౌజింగ్‌ వేగవంతమయ్యేలా హెల్ప్ చేస్తుంది. సాధారణంగా యాడ్‌ఆన్‌ ఆప్షన్లు మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో ర్యామ్‌ని ఆక్యుపై చేస్తుంటాయి. అందువల్ల అనవసరమైన యాడ్‌ఆన్‌లను రిమూవ్‌ చేసుకోవడం మంచిది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతోన్న పెర్ఫార్మెన్స్‌ ఆప్షన్‌ కూడా ఇదే రకమైన పనిచేస్తుంది. దీనివల్ల బ్రౌజింగ్‌ వేగం పెరుగుతుందని ఫైర్‌ఫాక్స్‌ చెబుతోంది.

జన రంజకమైన వార్తలు