• తాజా వార్తలు
  •  

ఫ్రీడో కాస్ట్ – ఎక్కడనుండి అయినా లైవ్ వీడియోస్ బ్రాడ్ కాస్టింగ్ కి అద్భుతమైన గ్యాడ్జెట్

ప్రముఖ ఇంటర్ నెట్ బేస్డ్ వీడియో ప్రొవైడర్ అయిన యప్ టీవీ ఫ్రీడో కాస్ట్ ప్రో డివైస్ మరియు ఫ్రీడోకాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం లను లాంచ్ చేసింది. యూజర్ లు ఒకేసారి అనేక రకాల డివైస్ లనుండి మరియు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లు అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు యు ట్యూబ్ లైవ్ ల ద్వారా వీడియో లను లైవ్ స్ట్రీం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
కెమెరా, స్విచ్చర్ ఇలా ఏ వీడియో సోర్సు కైనా ఈ ఫ్రీడో కాస్త్దేవిసు ను కనెక్ట్ చేయవచ్చు. అంతేగాక ఆండ్రాయిడ్/ ఐఒఎస్ యాప్ ద్వారా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. తద్వారా హై క్వాలిటీ లైవ్ వీడియో లను బ్రాడ్ కాస్ట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా లైవ్ బ్రాడ్ కాస్ట్ లను ప్రీ వ్యూ , కంట్రోల్ మరియు బ్రాడ్ కాస్ట్ చేయవచ్చు.
లైవ్ బ్రాడ్ కాస్టింగ్ లో వస్తున్న వృద్ది యూజర్ లు కాంటెంట్ ను ఉపయోగించుకునే విధానాన్ని మార్చివేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ అనేది విరివిగా లభిస్తున్న ఈ రోజుల్లో వినియోగదారులు దేన్నైనా రియల్ టైం లో చూడాలని కోరుకుంటున్నారు. ఈ ఫ్రీడోకాస్ట్ ప్రో డివైస్ మరియు ఫ్రీడోకాస్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం ద్వారా ఇలాంటి రియల్ టైం వీడియో లను అతి తక్కువ ఖర్చులో, అత్యంత నాణ్యమైన క్వాలిటీ తో అందిస్తున్నాం అని యప్ టీవీ యొక్క ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన ఉదయ రెడ్డి తెలిపారు.
ఈ డివైస్ 2 గంటల పాటు నిరంతర లైవ్ ను అందించేలా రీ చార్జబుల్ బాటరీ ని కలిగి ఉంటుంది. అంతేగాక HDMI IN/OUT మరియు MIC లను AV సోర్స్ లకు అందిస్తుంది.
ఈవెంట్ లను రియల్ టైం లో ఎడిట్ చేసుకోవడానికి ఇది టైలర్ మేడ్ సొల్యూషన్ ల వివిధ రకాల ఫ్లాట్ ఫాం లపై అందిస్తుంది.

జన రంజకమైన వార్తలు