• తాజా వార్తలు
  •  

పాత డోంగిల్ ఎక్స్చేంజి చేస్తే రూ.499కే జియోఫైరిలయన్స్ జియో 4జీ సేవలు మొదలైన తరువాత మంచి పెర్ఫార్మెన్సు ఉన్న 3జీ హ్యాండ్ సెట్స్ వాడేవారంతా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. జియో ఫ్రీ 4జీ డాటా, అన్ లిమిటెడ్ కాల్స్ కోసం కొత్తగా 4జీ ఫోన్ కొనాలా... లేదంటే అనవసరంగా 3జీ డాటా ప్యాకేజీల కోసం ఖర్చు చేస్తూ జియో ఫ్రీ ఆఫర్లను వదులుకోవాలా అన్న సందిగ్థావస్థలో ఉండేవారు. అలాంటివారి కోసం ‘జియో ఫై’ పేరుతో 4జీ వైఫై కాంపాక్ట్ రూటర్ ను అప్పుడే ప్రవేశపెట్టింది జియో. అది కూడా మంచి ఆదరణ పొందింది. అధిక ధరలు పెట్టి 4జీ ఫోన్లు కొనుగోలు చేసే అవసరం లేకుండా రూ.1999 ధరకు జియోఫై కొనుగోలు చేసి దాన్నుంచి వైఫై హాట్ స్పాట్ ఆన్ చేసి జియో సేవలను పొందే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు జియో మరో అద్భుత ఆఫర్ ఇవ్వడంతో మళ్లీ జియో సిమ్ లకు గిరాకీ ఏర్పడుతోంది.

ఏ కంపెనీవైనా సరే 3జీ లేదా 4జీ డోంగిల్స్ ఉంటే వాటని ఎక్స్చేంజి చేసుకుని జియోఫైని కేవలం రూ.499 ధరకే కొనుగోలు చేసుకునే వీలు కల్పిస్తోంది రిలయన్స్. తాజా ఆఫర్ తో డాటా వినియోగదారులు ఎక్కడెక్కడో మూలన పడేసిన డోంగిల్స్ బయటకు తీసి ఎక్స్చేంజి చేయడానికి రెడీ అవుతున్నారు.
ఏం చేయాలి..
* ఇది నేరుగా రిలయన్స్ స్టోర్ల నుంచి పొందాల్సిన ఆఫర్.
* తమ పాత డోంగిల్స్ ను అక్కడ ఇచ్చి రూ.499 చెల్లించి జియోఫై తీసుకోవాల్సి ఉంటుంది. అయితే... దాంతో పాటు జియో కొత్త సిమ్ కొనుగో చేసి ధనాధన్ ఆఫర్ వేయించుకోవడం తప్పనిసరి.

* అప్పుడు రూ.499కే జియో ఫై రావడంతో పాటు అదనంగా రూ.408తో ప్రైమ్ మెంబర్షిప్, ధనాదన్ ఆఫర్ వేయించాలి. 3 నెలల పాటు జియో 4జీ, కాల్స్ ఆఫర్ వస్తుంది.
పరిమితులు..
* ప్రస్తుతానికి కొన్ని స్టోర్లలోనే లభిస్తోంది.
* కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి ఆ సమాచారం తెలుసుకోవచ్చు.
* లొకేషన్ ను బట్టి కొన్ని చోట్ల జియోఫై రూటర్ 2, కొన్ని చోట్ల రూటర్ 3 ఇస్తారు.

జన రంజకమైన వార్తలు