• తాజా వార్తలు
  •  

జియో ఎల్‌వైఎఫ్ ఫోన్ల‌ను స‌గం ధ‌ర‌కే ఇస్తుందంటే కార‌ణ‌మేంటి? 

జియో త‌న సొంత బ్రాండ్‌తో త‌యారుచేయించిన‌ ఎల్‌వైఎఫ్ ఫోన్లను సగం ధ‌ర‌కే ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తోంది.   Lyf C459 స్మార్ట్‌ఫోన్ ధ‌ర  4,699 రూపాయ‌లు కాగా Lyf C451 ధ‌ర 4,999 రూపాయ‌లు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల‌ను జియో గ‌త సంవ‌త్స‌రం లాంచ్ చేసింది.   ఇప్పుడు ఈ ఫోన్లు కొంటే 99 రూపాయ‌ల జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌, రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ 84 రోజుల‌పాటు ఇచ్చే 399 రూపాయ‌ల డేటా ప్లాన్‌,  మినిమం 149 రూపాయ‌ల రీఛార్జితో నెల‌కు 5జీబీ ఎక్స్‌ట్రా డేటా ఇచ్చే ప్లాన్‌ను 9 నెల‌ల‌పాటు (మొత్తం 1809 రూపాయ‌ల విలువ‌) అందిస్తుంది. ఇవ‌న్నీ లెక్క‌పెడితే మొత్తం 2,307 రూపాయ‌లు సేవ్ అవుతాయ‌ని జియో చెబుతోంది. అప్పుడు  Lyf C459 ధ‌ర 2,392 రూపాయ‌లు, Lyf C451 ధ‌ర 2,692 అవుతుంద‌ని ప్ర‌క‌టించింది.  

ఎందుకింత స్మార్ట్ ఆఫ‌ర్‌? 
2వేల రూపాయ‌ల‌కే ఈ స్మార్ట్‌ఫోన్ల‌ను జియో ఎందుకిస్తుంది?   పండ‌గ‌ల సీజ‌న్ కాబ‌ట్టి ఆఫ‌ర్ అని చెబుతారు. కానీ వాస్త‌వం వేరే ఉంది.  ఎయిర్‌టెల్ 4జీ ఎనేబుల్డ్  VoLTE స్మార్ట్‌ఫోన్ల‌ను 2వేల రూపాయ‌ల కంటే త‌క్కువ ధ‌ర‌కే తీసుకురావ‌డానికి ఎయిర్‌టెల్ సిద్ధంగా ఉంది.  దీంతోపాటు జియో మాదిరిగానే వాయిస్‌, డేటా బండిల్డ్ ఆఫ‌ర్స్ ఇస్తారు. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ ల్లో కొత్త‌వారితోపాటు ఇప్పుడున్న యూజ‌ర్ల‌కు కూడా ఈ హ్యాండ్‌సెట్ ఆఫ‌ర్ తీసుకురాబోతున్నారు. 1జీబీ ర్యామ్‌, 4 ఇంచెస్ స్క్రీన్‌తో వ‌చ్చే ఈ స్మార్ట్‌ఫోన్ తో జియోను దీటుగా ఎదుర్కోవాల‌న్న‌ది ఎయిర్‌టెల్ ప్లాన్?  మ‌రోవైపు  వొడాఫోన్ కూడా ఈ 2వేల‌లోపు స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. సో ఈ కాంపిటీష‌న్ త‌ట్టుకుని నిల‌బ‌డడానికే జియో త‌న ఎల్‌వైఎఫ్ బ్రాండ్ ఫోన్ల‌పై ఈ ఆఫ‌ర్స్ పెట్టింది.  
వ‌ర్క‌వుట్ అవుతుందా? 
అయితే ఎల్‌వైఎఫ్ ఫోన్ల ధ‌ర  4,500కు పైనే ఉంది. డేటా, కాల్ ఆఫ‌ర్స్ వంటివ‌న్నీ క‌లిపితేనే ఇవి స‌గం ధ‌ర‌కు వ‌స్తున్న‌ట్లు లెక్క. మ‌రోవైపు ఎయిర్‌టెల్ 2వేల లోపే ఫోన్ తెస్తే యూజ‌ర్లు దేనివైపు చూస్తారో మ‌రి.. 

 

జన రంజకమైన వార్తలు