• తాజా వార్తలు

మొత్తానికి ఎల్జీ నుంచి ఓ బ‌డ్జెట్ ఫోన్.. క్యూ6

15 వేల రూపాయ‌ల  ధ‌ర‌లో దొరికే  మిడ్ రేంజ్ ఫోన్లదే  ప్ర‌స్తుతం మొబైల్ మార్కెట్‌లో పెద్ద షేర్‌. అందుకే కార్బ‌న్ నుంచి శాంసంగ్ వ‌ర‌కు కంపెనీల‌న్నీ ఈ ప్రైస్ రేంజ్‌లో వంద‌ల కొద్దీ మోడ‌ల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. కానీ కొరియ‌న్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ మాత్రం ఇప్ప‌టి దాకా ఈ సెగ్మెంట్ వైపు చూడ‌నే లేదు.  లేటెస్ట్‌గా మాత్రం LG Q6 పేరుతో ఫ‌స్ట్ మిడ్ సెగ్మెంట్ ఫోన్ ను రిలీజ్ చేసింది.  

 ఎల్‌జీ జీ6 కనిపించే ఈ ఫోన్ దానికంటే సైజ్‌లో కాస్త చిన్న‌ది.  అయితే 5.5 ఇంచెస్ తో ఈ సెగ్మెంట్‌లో మిగ‌తా ఫోన్ల‌కు ఈక్వ‌ల్ సైజ్‌లోనే ఉంది.   2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ ఇచ్చే ఈ ఫోన్ మిడ్‌రేంజ్   సెగ్మెంట్‌లో ఇదొక్క‌టే.  కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 7000 సిరీస్ అల్యూమినియం తో  ఫోన్‌ను త‌యారు చేశారు. అందుకే ఈ ఫోన్ మిల‌ట్రీ గ్రేడ్ డ్యూర‌బుల్ అని ఎల్జీ ప్ర‌క‌టించింది.  అయితే బాక్‌సైడ్ మాత్రం కొంచెం వీక్‌గా క‌నిపిస్తుంది. 
ప్రైస్ 14,990
ఎల్‌జీ క్యూ6  ప్రైస్ రూ.14,990.  అమెజాన్‌లో  ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతంది.  ఆస్ట్రో బ్లాక్‌, ఐస్ ప్లాటినం, టెర్రా గోల్డ్ క‌ల‌ర్స్‌లో ఉంది.  

ఎల్‌జీ క్యూ6 స్పెసిఫికేష‌న్స్ 
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే .. 2160 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 435 ప్రాసెస‌ర్ 
*  3/4  జీబీ ర్యామ్ 
* 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 
 * 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* 13 మెగాపిక్స‌ల్  రియ‌ర్  కెమెరా 
* 5 ఎంపీ  ఫ్రంట్ కెమెరా 
*  ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్ ఓఎస్  
*  4జీ వీవోఎల్‌టీఈ 
* బ్లూటూత్ 4.2 ఎల్ఈ