• తాజా వార్తలు
  •  

ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన ఫోన్ల గురించి తెలుసా? 

స్మార్ట్‌ఫోన్ల‌లో అత్యంత ఖ‌రీదైన ఫోన్ ఏది?  ఐఫోన్ టెన్‌. ఇదే మీ స‌మాధానం అయితే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఐఫోన్ టెన్ ధ‌ర 83,000. కానీ ల‌క్ష‌లు, కోట్ల రూపాయ‌లు ఖ‌రీదు చేసే ఫోన్లు కూడా ఉన్నాయి. అవేమీ యాపిల్‌, శాంసంగ్ కంటే సుపీరియ‌ర్ కంపెనీల‌వి కాదు. వాటి మేకోవ‌ర్‌, క‌స్ట‌మైజేష‌న్ వ‌ల్లే ఆ ఫోన్ల‌కు అంత కాస్ట్‌.  ఫోన్ అనేది స్టేట‌స్ సింబ‌ల్స్ అని భావించే మ‌ల్టీ మిలియ‌నీర్ల కోస‌మే వీటిని కంపెనీలు ప్ర‌త్యేకంగా త‌యారుచేస్తాయి.
వెర్చ్యూ సిగ్నేచ‌ర్ డైమండ్ (Vertu Signature Diamond)
వెర్చ్యూ .. ప్ర‌పంచంలో ల‌గ్జ‌రీ ఫోన్లు వాడాల‌న‌కునేవాళ్లంద‌రూ కాంటాక్ట్ చేసే కంపెనీ ఇది. ప్ర‌తి ఫోన్‌ను హ్యాండ్ మేడ్‌గా ప్లాటినం వంటి అత్యంత ఖ‌రీదైన మెట‌ల్‌తో త‌యారు చేస్తారు. సిగ్నేచ‌ర్ డైమండ్‌లోనూ ప్లాటినంతోపాటు వ‌జ్రాలు పొదిగారు. ధ‌ర ఎంత‌నుకుంటున్నారు. 88వేల డాల‌ర్ల‌కు పైనే. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే జ‌స్ట్ 57 ల‌క్ష‌ల 58వేల రూపాయ‌లు.  
బ్లాక్ డైమండ్ వీఐపీ (BlackDiamond VIP) 
సోనీ ఎరిక్స‌న్‌కు చెందిన ఈ కాస్ట్లీ ఫోన్‌ను జేరెన్ గో డిజైన్ చేశారు. మిర్ర‌ర్ డిటైలింగ్‌, ఆర్గానిక్ ఎల్ఈడీ టెక్నాల‌జీ, పాలీకార్బ‌నేట్ మిర్ర‌ర్ వంటి అత్యుత్త‌మ‌మైన మెటీరియ‌ల్‌తో ఈఫోన్‌ను త‌యారుచేశారు. ఖరీదు ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. 
గ్రెస్సో ల‌గ్జ‌ర్ లాస్‌వెగాస్ జాక్‌పాట్  (Gresso Luxor Las Vegas Jackpot)
ఈ ఫోన్‌ను 180 గ్రామ్‌ల బంగారంతో త‌యారు చేశారు. వెనక భాగంలో ప్యాన‌ల్ 200 సంవ‌త్స‌రాల క్రితం నాటి ఆఫ్రిక‌న్ ఉడ్‌తో డిజైన్ చేశారు. ఈ ఫోన్‌లో వాడిన బంగారం కంటే ఈ ఉడ్డే ఖ‌రీదు ఎక్కువంట‌. దీని ధ‌ర దాదాపు ఆరున్న‌ర కోట్ల రూపాయ‌లు ఉంటుందంట‌. అంటే ఇక ఆ ఫోన్ ఖ‌రీదు ఎంతుంటుందో ఊహించుకోండి. 
 డైమండ్ క్రిప్టో స్మార్ట్‌ఫోన్  (Diamond Crypto Smartphone) 
విండోస్ సీఈ ఫోన్ ను బేస్ చేసుకుని పీట‌ర్ అలాయిస‌న్ దీన్ని డిజైన్ చేశారు.  దీని క‌వ‌ర్‌లో 50 డైమండ్స్ ఉన్నాయి. అందులో 10 జాతి నీలం రాళ్లు. ధ‌ర ఎంతో కాదు ఎనిమిది కోట్లు. 
గోల్డ్ విష్ లీ మిలియ‌న్ (GoldVish Le Million)
ఇమ్మాన్యుయేల్ గ్విట్ అనే డిజైన‌ర్ త‌యారుచేసిన ఈ ఫోన్ ల‌గ్జ‌రీ ఫోన్ల‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. 1.3 మిలియ‌న్ డాల‌ర్లు (ఎనిమిదిన్నర కోట్ల రూపాయ‌ల) ధ‌ర‌తో ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ఫోన్‌గా గిన్నిస్ రికార్డ్ కూడా కొట్టేసింది.  

జన రంజకమైన వార్తలు