• తాజా వార్తలు
  •  

బెజల్ లెస్ డిస్ ప్లే తో వచ్చిన టాప్ ఫోన్ లు ఇవే

2014 వ సంవత్సరం లో జపాన్ కు చెందిన హ్యాండ్ సెట్ మేకర్ అయిన షార్ప్ అనే ఒక కంపెనీ బెజెల్ లెస్ డిజైన్ తో కూడిన ఆక్వాస్ అనే ఒక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అయితే ఆ సమయం లో దానిని చూసి అందరూ పెదవి విరిచారు. అయితే  గత సంవత్సరం ఇదే డిజైన్ తో షియోమీ Mi మిక్స్ అనే ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన తర్వాత అందరి చూపు వాటి పై పడింది. ఫోన్ కు మూడువైపులా బెజల్స్ లేకుండా ఉండే డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ అప్పట్లో చూడడానికి అంతగా ఆకర్షణీయంగా లేనప్పటికీ స్మార్ట్ ఫోన్ లలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.

ఇక ఈ సంవత్సరం చూస్తే ఈ బెజల్ లెస్ ఫోన్ లు మార్కెట్ లో హల్ చల్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. అన్ని పెద్ద బ్రాండ్ లు ఈ తరహా స్మార్ట్ ఫోన్ ల తయారీ కి మొగ్గు చూపుతున్నాయి. ఇవి వీటి లుక్ ను మార్చడం మాత్రమే గాక పెద్ద స్క్రీన్ లతో ఈ ఫోన్ లను తయారు చేస్తున్నాయి. ఇంతకీ బెజల్స్ అంటే ఏమిటో తెలుసా? అదేనండీ మన ఫోన్ లకు గానీ ట్యాప్ లకు గానీ చుట్టూ ఉండే అంచునే బెజల్ అంటారు. అంటే ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్ లకు చుట్టూ ఆంచు ఉండదు అన్నమాట. ఈ నేపథ్యం లో ప్రస్తుతం లభిస్తున్న టాప్ బెజల్ లెస్ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో తెల్సుకుందాం.

సామ్ సంగ్ గాలక్సీ S8 అండ్ S 8 +                     

ఈ తరహా ట్రెండ్ ను అందిపుచ్చుకోవడం లో సామ్ సంగ్ ముందు వరుసలో ఉంది. సామ్సంగ్ తన ఫ్లాగ్ షిప్ మొబైల్ లు అయిన గాలక్సీ S8 మరియు S 8 + లను బెజల్ లెస్ డిస్ప్లే తో విడుదల చేసింది. వీటిలో బెజల్స్ లేకపోవడమే గాక దీని డైమెన్షన్ లు  18:5:9  నిష్పత్తి లో ఉంటాయి. దీనినే సామ్ సంగ్ ఇన్ఫినిటీ డిస్ప్లే అని పిలుస్తుంది. ఇది AMOLED టెక్నాలజీ మరియు QHD రిసోల్యూషణ్ ను కలిగి ఉంటుంది. HD వీడియో లను రికార్డు చేయడం లో ఇది అత్యుత్తమ మైనది. ఇది లేటెస్ట్ ఎక్సి నాస్ 8895 SoC మేటెడ్ 4 GB RAM ను కలిగి ఉంటుంది. వీటి ధర రూ 56,999/-  ల నుండీ ఉంటుంది.

LG G 6

LG గత సంవత్సరం విడుదల చేసిన G 5 స్మార్ట్ ఫోన్ అంతగా విజయవంతం అవ్వని నేపథ్యం లో పూర్తీ గా తన డిజైన్ ను మార్చుకుని బెజల్ లెస్ డిస్ప్లే తో కూడిన LG G6 అనే స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీని ధర రూ 37,000/-  లు ఉంటుంది. 5.7 ఇంచెస్ ఉండే దీని డిస్ప్లే 1440x2880 పిక్సెల్ రిసోల్యూషన్ ను కలిగి ఉంటుంది. సామ్ సంగ్ మాదిరిగానే ఇది కూడా విశిష్టమైన 18:9 నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఇది HDR10 మరియు డాల్బీ విజన్ ను సపోర్ట్ చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 821 SoC మరియు 4 GB RAM ను ఇది కలిగి ఉంటుంది.

LG Q 6

ఈ మధ్యనే LG ఈ Q 6 అనే మొబైల్ ను ఇండియా లో లాంచ్ చేసింది.ఇది కూడా బెజల్ లెస్ డిజైన్ తో ఉంది 5.5 ఇంచ్ FHD + డిస్ప్లే ను కలిగి ఉంటుంది.18 : 9 నిష్పత్తి లో దీని డిజైన్ ఉంటుంది.ఇది MIL-STD 810 G సర్టిఫికేట్ ను కలిగిఉంది. ఇందులో 3 GB RAM 32 GB స్టోరేజ్ మరియు క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 435 SoC ఉంటాయి. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఒఎస్ తో కూడిన ఇందులో 3,000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని ధర కేవలం రూ 14,990/- లు మాత్రమే ఉంటుంది.

నుబియా Z11

76 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే బెజల్ లెస్ డిజైన్ తో కూడిన Z11 ఫోన్ ను నుబియా లాంచ్ చేసింది. 5.5 ఇంచ్ IPS డిస్ ప్లే మరియు ఫుల్ HD రిసోల్యూషన్ ను కలిగి ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 820 SoC మరియు 6 GB RAM ను ఇది కలిగిఉంటుంది.16 MP ,8 MP కెమెరా లను కలిగిఉంటుంది. 3000 mAh బ్యాటరీ మరియు 3.0 క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉంటాయి. దీని ధర రూ 24,999 /- లు ఉంటుంది.

 

 

జన రంజకమైన వార్తలు