• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్ గో తో మ‌రింత త‌గ్గ‌నున్న ఎంట్రీ లెవెల్ 4జీ ఫోన్ల ధ‌ర‌లు 

ఫీచ‌ర్ ఫోన్ల ధ‌ర‌కే  4జీ స్మార్ట్‌ఫోన్లు  అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్ వంటి టెల్కోలు కార్బ‌న్ వంటి కంపెనీల‌తో క‌లిసి త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు మార్కెట్లోకి తెచ్చాయి. అయితే ఇలా క్యారియ‌ర్‌తో ప‌ని లేకుండా నేరుగానే 2,500 నుంచే ఎంట్రీ లెవెల్ 4జీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆండ్రాయిడ్ గో.
ఏమిటీ ఆండ్రాయిడ్ గో? 
ఇది గూగుల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం. జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మ‌వుతుంది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు ముఖ్యంగా 512 ఎంబీ నుంచి 1జీబీ ర్యామ్‌తో ప‌నిచేసే ఫోన్ల కోసం దీన్ని త‌యారుచేశారు. ఇండియ‌న్ కంపెనీల‌యిన మైక్రోమ్యాక్స్‌, కార్బ‌న్‌, లావా, ఇంటెక్స్ లాంటి కంపెనీల‌న్నీ దీన్ని అందిపుచ్చుకుని త‌క్కువ ధ‌ర‌కు 4జీ ఫోన్లు తీసుకురావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి.  ఆండ్రాయిడ్ గో తో 4జీ స్మార్ట్‌ఫోన్ల స్టార్టింగ్ ధ‌ర ఇప్పుడున్న 3వేలు, 3,500 కంటే మ‌రింత త‌గ్గుతుంది. అంతేకాదు బెట‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్‌, ఇంప్రూవ్డ్ స్పెసిఫికేష‌న్స్ కూడా యూజ‌ర్‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌ని కార్బ‌న్ మొబైల్స్ ఈడీ ష‌షిన్ దేవ్‌స‌రే చెప్పారు.  లావా కూడా ఆండ్రాయిడ్ గో ఫ్లాట్‌ఫాంపై న‌డిచే డివైస్‌ను జ‌న‌వ‌రంలిలో తీసుకురాబోతోంది. భార‌త్ సిరీస్‌లోనే ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తామ‌ని మైక్రోమ్యాక్స్ చెబుతోంది.  ఎయిర్‌టెల్‌, ఐడియా ఇలా ఏదైనా క్యారియ‌ర్‌తో లింక‌ప్ అయితే ఈ ఫోన్ల ధ‌ర 2వేల లోపే ఉండొచ్చు. 
ఎందుకు తెస్తుందంటే? 
ఇండియాలో మొబైల్ ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల సంఖ్య భారీగా పెరిగింది. అయినా ఇప్ప‌టికీ 50 శాతం మంది ఫీచ‌ర్ ఫోన్లే వాడుతున్నార‌ని జియో ఫోన్ లాంచింగ్ వేళ అంబానీ చెప్పారు.  ఫీచ‌ర్ ఫోన్‌ను కూడా 2వేల వ‌ర‌కు పెట్టి కొంటున్నారు. దానికి 500, 1000 రూపాయ‌లు క‌లిపితే స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేలా ఉంటే ఎక్కువ మంది దీనివైపు వ‌స్తార‌ని, త‌ద్వారా త‌మ ఇంట‌ర్నెట్ యూజ‌ర్ బేస్ పెరుగుతంద‌న్న‌ది గూగుల్ ఆలోచ‌న‌. అందుకే ఆండ్రాయిడ్ గో ని మార్కెట్లోకి తెస్తోంది. చైనా కంపెనీల దెబ్బ‌కు మార్కెట్లో నిల‌దొక్కుకోవ‌డానికే అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న ఇంటెక్స్‌, లావా, కార్బ‌న్ లాంటి కంపెనీల‌కు ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌ట్టు సాధించడానికి ఇది మంచి అవ‌కాశం. 
 

జన రంజకమైన వార్తలు