• తాజా వార్తలు

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7ల్లో  నుంచి 157 ట‌న్నుల‌ బంగారం తీస్తారు..!

శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌7..     శాంసంగ్ కంపెనీ చ‌రిత్ర‌లోనే అత్యంత ఫెయిల్యూర్ అయిన ప్రొడ‌క్ట్ ఇదే. బ్యాట‌రీలో టెక్నిక‌ల్ ప్రాబ్లం ఏర్ప‌డి ఏకంగా అవి పేలిపోవ‌డం శాంసంగ్‌కు పెద్ద ఎఫెక్టే ఇచ్చింది.  క‌స్ట‌మ‌ర్ల నుంచి కంప్ల‌యింట్స్ వెల్లువెత్త‌డంతో అప్ప‌టికే అమ్మిన గెలాక్సీ నోట్ 7 ఫోన్ల‌న్నీ రీకాల్ చేసింది.  దీంతో వంద‌ల కోట్ల న‌ష్టం వ‌చ్చింది.  అయితే కంపెనీ గొడౌన్ల‌లో అమ్మ‌కుండా మిగిలిన  నోట్‌7 ఫోన్లకు కొత్త టెక్నాల‌జీతో త‌యారుచేసిన 3,200 ఎంఏహెచ్ బ్యాట‌రీని వేసి   గెలాక్సీ నోట్  ఎఫ్‌ఈ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేసింది.


పాత ఫోన్‌ల‌ను ఏం చేసింది

క‌స్ట‌మ‌ర్ల నుంచి రీకాల్ చేసిన ఫోన్ల‌ను శాంసంగ్ రీ ఫ‌ర్బిష్ చేసి అమ్ముతోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే  వీటిని రీసైకిల్ చేస్తోంద‌ని స‌మాచారం.   నోట్‌7 ఫోన్లను రీసైకిల్ చేస్తే అందులో చాలా విలువైన లోహాలు దొరుకుతాయి.  దీనిద్వారా 157 టన్నుల బంగారం, వెండి, కోబాల్ట్‌, రాగివంటి విలువైన మెట‌ల్స్‌ను  సేకరించే ప‌నిని ఈ నెలాఖ‌రులోగానే శాంసంగ్ స్టార్ట్ చేయ‌బోతోంది.

డిస్‌ప్లేలు, కెమెరాలు దాచేస్తారు

అయితే గెలాక్సీ ఎస్‌7లో ఉన్న అమౌల్డ్ డిస్‌ప్లే, మెమ‌రీకి సంబంధించిన సెమీ కండ‌క్ట‌ర్స్‌, కెమెరా మాడ్యూల్స్‌ను మాత్రం స‌ప‌రేట్ చేస్తారు. వీటిని త‌ర్వాత ఏదైనా ఫోన్ల‌లో వాడ‌తారు.  కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్‌లో జ‌రిగే  ఈ రీసైకిల్‌ ప్రక్రియ నెలాఖ‌రులోగా స్టార్ట్ కానుంది.