• తాజా వార్తలు

    స్మార్టు ఫోన్ స్క్రీన్ సైజ్ పెరుగుతోంది.. 

  స్మార్టు ఫోనంటే 5.5 అంగుళాల స్క్రీన్... ఇదీ ఇప్పుడు నూటికి 90 శాతం మెంటైన్ చేస్తున్న సైజ్. అటు వీడియోలు చూడడానికైనా, ఇటు ఈజీగా హ్యాండిల్ చేయడానికైనా కూడా వీలుగా ఉండే పరిమాణం ఇదేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అయితే... ఇటీవల కాలంలో ఈ సైజు ఇంకొంచెం పెరుగుతోంది. మెల్లమెల్లగా 6 అంగుళాల వద్ద స్థిరపడిపోయేలా కనిపిస్తోంది. కొన్ని ఫోన్లు ఆరు అంగుళాల కంటే పెద్ద స్క్రీన్ ఉన్నవి వస్తున్నా అవి అంత కంఫర్టబుల్ గా లేవని.. 6 అంగుళాలయితే కంఫర్టబుల్ గానే ఉందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 6 అంగుళాలు, అంతకంటే పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లు కొన్ని చూద్దాం..
* ఎంఐ మ్యాక్స్..
దీని స్క్రీన్ సైజ్ 6.44 అంగుళాలు. బరువు 203 గ్రాములు. అంటే సుమారు పావు కేజీ బరువన్నమాట. ఇందులో ఫీచర్లన్నీ బాగున్నప్పటికీ బరువు అతి పెద్ద సమస్య. అలాగే 6.44 అంగుళాల స్క్రీన్ అంటే ఇంచుమించుగా ట్యాబ్లెట్ పరిమాణంలో కనిపిస్తుంది.
* ఆసుస్ జెన్ ఫోన్ 2
ఇది 6 అంగుళాల స్క్రీన్ తో అనువైన మోడల్ గా పేరు తెచ్చుకుంది.
* శాంసంగ్ గెలాక్సీ జే మ్యాక్స్
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్టు ఫోన్లలో ఇదే అతిపెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే... దీనికి ఏకంగా 7 అంగుళాల స్క్రీన్ ఉంది.
ఇవి కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రో, ఒప్పో ఎఫ్ 3 ప్లస్, లెనోవో ఫ్యాబ్ 2, సోనీ ఎక్స్ పీరీయా ఎక్స్ ఏ అల్ట్రా డ్యూయల్, లెనోవో ఫ్యాబ్ 2 ప్లస్, ఒప్పో ఆర్ 11 ప్లస్ వంటి మోడల్స్ భారీ స్క్రీన్లతో వచ్చాయి.