• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్‌తో నడుస్తున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవి

గూగుల్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ ఓరియో.  ఇప్ప‌టికీ చాలా ఫోన్ల‌లోకి ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆండ్రాయిడ్ ఓరియో 8.0 వెర్షన్ విడుదలై దాదాపు నాలుగు నెల‌లు గ‌డిచింది. ఇప్ప‌టికీ  కేవలం 0.7 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్ అయిన‌ట్లు ఆండ్రాయిడ్ అధికారిక డెవలపర్ల బ్లాగ్ ప్ర‌క‌టించింది. ఈ ప‌రిస్థితుల్లో కొన్ని బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల‌కు కూడా ఓరియో అప్‌డేట్ రానుంది. అలాంటి ఫోన్ల వివ‌రాలు మీకోసం..
హానర్ 9 లైట్ (Honor 9 Lite)
ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ అందిస్తున్న మొట్టమొదటి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హానర్ 9 లైట్. హువావే  సబ్‌బ్రాండ్ అయిన హానర్  ఎమోషన్ UIతో ఇంటర్‌స్పేస్‌ను భర్తీ చేస్తుంది. 5.6 అంగుళాల ఫుల్  హెచ్‌డీ డిస్‌ప్లే, 2160x1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో స్క్రీన్ చాలా బ్రైట్‌గా, డెప్త్‌గా ఉంటుంది. 659 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు.  ధర 10,999రూపాయలు.
నోకియా 5 (Nokia 5)
హెచ్ఎండీ గ్లోబల్  ఓరియో అప్‌డేట్‌తో నోకియా 5ను రిలీజ్ చేసింది.  ఇది MI A1  మాదిరిగానే సాదా ఆండ్రాయిడ్‌ను  రన్ చేస్తుంది. 3జీబీ ర్యామ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 430 క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌,  16జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్ ఉన్నాయి.  ఇంట‌ర్న‌ల్ స్టోరేజిని ఎస్‌డీ కార్డుతో128 జీబీ వరకు పెంచుకోవ‌చ్చు. స్మాల్ స్క్రీన్ కోరుకునే యూజర్లకు బాగుంటుంది. 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 5.2అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఓరియోని అందించే ఫోన్ల‌లో మోస్ట్ ఎఫ్రాడ‌బుల్‌ స్మార్ట్‌ఫోన్ ఇది. ధర 12,499 రూపాయలు.
షియోమీ ఎంఐ A1 (Xiaomi Mi A1)
షియోమీ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్...ఆండ్రాయిడ్ నౌగట్ 7.0తో రన్ అవుతుంది. గతేడాది పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల తర్వాత ఓరియో అప్‌డేట్‌ను అందుకున్న మొదటి ఫోన్ ఇది. 5.5 అంగుళాల డిస్‌ప్లేతోపాటు ఆక్టాకోర్ క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగ‌న్ 625 ప్రాసెసర్‌, స్టాక్ ఆండ్రాయిడ్ UI ఉన్నాయి. ఒరిజినల్ రిజల్యూషన్ పిక్చర్స్ కోసం గూగుల్ డ్రైవ్‌లో అన్ లిమిటెడ్ స్టోరేజిని ఆఫ‌ర్ చేస్తోంది. ఈ ఏడాది ఆండ్రాయిడ్ 9 అప్‌డేట్‌ను కూడా అందించాలని ప్లాన్ చేస్తుంది. ప్రైస్ 13,999.
ఆసుస్ జెన్ ఫోన్ 4 (Asus ZenFone 4)
ఆసుస్ జెన్ ఫోన్ 3... ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్‌తో వ‌స్తున్న మ‌రో  బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌. 1920x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తోపాటు 5.2 అంగుళాల స్క్రీన్ ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కామ్  స్నాప్ డ్రాగ‌న్ 625 ప్రాసెసర్ ఉంది. 3జీబీ ర్యామ్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌,  గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో యూజర్లను  ఆకట్టుకుంటుంది.  ధర 14,999 రూపాయలు.
మోటో ఎక్స్ 4  (Moto X4)
లేటేస్ట్ 6 జీబీర్యామ్ వేరియంట్‌తో రిలీజ్ అయిన మోటో ఎక్స్ 4 ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్‌తో అప్‌డేట్ అయింది.  లేటెస్ట్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 630 ప్రాసెసర్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ దీని స్పెసిఫికేష‌న్స్‌. ఇంటర్నల్ స్టోరేజీని 2టీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. 1920,1080పిక్సెల్స్ రిజల్యూషన్‌తో  5.2 ఇంచెస్ స్క్రీన్‌తో వ‌స్తున్న ఈ ఫోన్‌లో ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్. 1.5 మీటర్స్ వరకు  వాటర్ ప్రూఫ్‌తో మ‌రో స్పెషాలిటీ. డ్యూయ‌ల్ కెమెరాలు కూడా ఉన్నాయి.   ప్రైస్ రూ. 24,999

జన రంజకమైన వార్తలు