• తాజా వార్తలు
  •  

అతి చ‌వ‌కైన 4జీ ఫోన్లు ఇవే..  

3జీ ఫోన్ల‌కు కాలం చెల్లిపోయింది.  టెలికం కంపెనీలు పోటీప‌డి అందిస్తున్న ఆఫ‌ర్ల‌ను అందుకోవాలంటే 4జీ ఫోన్లు త‌ప్ప‌నిస‌రి. అయితే ఇప్ప‌టికీ ఇండియాలో చాలా మంది ధ‌ర ఎక్కువ‌ని 4జీ ఫోన్ల‌వైపు వెళ్ల‌డం లేదు. అందుకే జియో, ఎయిర్‌టెల్ వంటి నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్స్ 4జీ ఎనేబుల్డ్ ఫోన్ల‌తో మార్కెట్‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నాయి. కానీ నాలుగైదు వేల‌కు కూడా పెద్ద కంపెనీల 4జీ ఫోన్లు దొరుకుతున్నాయి. అవేంటో చూడండి 
1.కార్బ‌న్ క్వాట్రో  ఎల్‌45 (Karbonn Quattro L45)
4జీ VOLTE  ఫెసిలిటీతో వ‌చ్చిన చౌకైన స్మార్ట్‌ఫోన్ ఇది. 1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన ఈ ఫోన్‌లో 1జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్నాయి. ఎస్డీ కార్డ్‌తో 32 జీబీ వ‌ర‌కు స్టోరేజిని పెంచుకోవ‌చ్చు.  ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0  ఓఎస్‌తో ర‌న్న‌య్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.5 ఇంచెస్ డిస్‌ప్లే, 5 ఎంపీ రియ‌ర్‌, 2మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాట‌రీ 1800 ఎంఏహెచ్‌. 
ప్రైస్‌: 4,499

2.శాంసంగ్ జెడ్ 2  (Samsung Z2) 
ఎల‌క్ట్రానిక్స్ దిగ్గ‌జం శాంసంగ్ త‌క్కువ ధ‌ర‌లో రిలీజ్ చేసిన 4జీ VOLTE  స్మార్ట్‌ఫోన్ ఇది. 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన ఈ ఫోన్‌లో 1జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్నాయి. ఎస్డీ కార్డ్‌తో 128 జీబీ వ‌ర‌కు స్టోరేజిని పెంచుకోవ‌చ్చు.  టైజ‌న్‌ ఓఎస్‌తో ర‌న్న‌య్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 ఇంచెస్ డిస్‌ప్లే, 5 ఎంపీ రియ‌ర్‌, 0.3 మెగాపిక్సెల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాట‌రీ 1,500 ఎంఏహెచ్‌. 
ప్రైస్‌: 4,450

3. కార్బ‌న్ ఆరా (Karbonn Aura) 
ఇండియ‌న్ సెల్‌ఫోన్ కంపెనీ సెల్‌కాన్  నుంచి వ‌చ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 4వేల లోపు ప్రైస్ రేంజ్‌లో 5 ఇంచెస్ స్క్రీన్‌తో రావ‌డం  హైలెట్‌. 1.2 గిగా హెర్ట్జ్   క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌, 512 ఎంబీ ర్యామ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్‌తో న‌డుస్తుంది.  5 ఎంపీ రియ‌ర్‌,2 మెగాపిక్సెల్  ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.  అయితే ఇది సింగిల్ సిమ్ ఫోన్ మాత్ర‌మే. బ్యాట‌రీ 2,000 ఎంఏహెచ్‌. 
ప్రైస్‌:  3,777.

4.పాన‌సోనిక్ పీ 55 (Panasonic P55) 
పాన‌సోనిక్ పీ55 కూడా చౌక ధ‌ర‌లో వ‌చ్చే మంచి 4జీ స్మార్ట్‌ఫోన్‌.  ఓఎస్‌, ర్యామ్ త‌ప్ప మిగిలిన అన్ని అంశాల్లో ఏడెనిమిది వేల రూపాయ‌ల ధ‌ర ప‌లికే ఫోన్ల‌తో పోటీ ప‌డుతుంది. 1జీబీ  ర్యామ్, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్  ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4 ఓఎస్‌తో న‌డుస్తుంది.  13 ఎంపీ రియ‌ర్‌, 5 మెగాపిక్సెల్  ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.  బ్యాట‌రీ 2,500 ఎంఏహెచ్‌. 
ప్రైస్‌:  5,699.

5.వీడియోకాన్ గ్రాఫైట్ 1 వీ45ఈడీ (Videocon Graphite 1 V45ED) 
త‌క్కువ ధ‌ర‌లో ఉన్న 4జీ స్మార్ట్‌ఫోన్ల‌లో ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఓఎస్ ఉన్న ఫోన్ ఇది. 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 5 ఎంపీ రియ‌ర్ కెమెరా, 3.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాట‌రీ 2,000 ఎంఏహెచ్‌. 
ప్రైస్‌:  5,999.
 

జన రంజకమైన వార్తలు