• తాజా వార్తలు
  •  

299 రూపాయ‌ల‌కే డీటెల్ ఫోన్ 

 స్మార్ట్‌ఫోన్‌లు కూడా మూడు, నాలుగు వేల రూపాయ‌ల నుంచి అందుబాటులోకి వ‌చ్చేయ‌డంతో క్ర‌మంగా ఫీచ‌ర్ ఫోన్ల మార్కెట్ త‌గ్గిపోతోంది. మ‌రోవైపు జియో.. స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల‌తో ఫీచ‌ర్ ఫోన్ ఫ్రీగా ఇచ్చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఫీచ‌ర్ ఫోన్ తయారీ కంపెనీల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో డీటెల్ ఇండియా అనే ఫీచ‌ర్ ఫోన్ల త‌యారీ కంపెనీ  Detel D1  Mobileలేదా Detel 299 mobileపేరుతో 299 రూపాయ‌ల‌కే ఫీచ‌ర్ ఫోన్ అమ్ముతామ‌ని అనౌన్స్ చేసింది. వ‌ర‌ల్డ్స్ చీపెస్ట్ ఫీచ‌ర్ ఫోన్ ఇదేన‌ని కంపెనీ చెబుతోంది. వాస్త‌వానికి ఈ ఫోన్ ధ‌ర 266 రూపాయ‌లే. అయితే 32 రూపాయ‌ల జీఎస్టీ యాడ్ అవ‌డంతో 299 రూపాయ‌లు అయింది. 

డీటెల్ డీ1 ఫీచ‌ర్ ఫోన్ ఫీచ‌ర్లు 
* 1.44 ఇంచెస్ మోనోక్రోమ్ డిస్‌ప్లే
* 650 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* సింగిల్ సిమ్ స్లాట్‌
* స్పీక‌ర్‌
* ఎఫ్ఎం రేడియో
* ఫోన్‌బుక్‌
* టార్చ్‌లైట్‌
ఎలా కొనుక్కోవాలి? 
డీటెల్ డీ1 ఫీచ‌ర్ ఫోన్ కొనాలంటే www.detel-india.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఏరియా పిన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి.  
* ఎన్ని ఫోన్లు కావాలో క్వాంటిటీ మెన్ష‌న్ చేయాలి. 
* త‌ర్వాత Add to cart ఆప్ష‌న్ క్లిక్ చేసి త‌ర్వాత proceed to checkout బ‌ట‌న్‌ను ప్రెస్‌ చేయాలి. 
* మీ పేరు, అడ్ర‌స్‌, మొబైల్ నెంబ‌ర్‌, మెయిల్ ఐడీ ఎంట‌ర్ చేయాలి. త‌ర్వాత  Create an account  ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. అకౌంట్ పాస్‌వ‌ర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. 
*  select your payment optionను క్లిక్ చేసి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా మ‌నీ పే చేయొచ్చు. సీవోడీ ఆప్ష‌న్ కూడా ఉంది. 
* Placed Order ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే వారం రోజుల్లో మీ  ఫోన్ డెలివ‌రీ చేస్తారు. 

జన రంజకమైన వార్తలు