• తాజా వార్తలు
  •  

కిల్ల‌ర్ స్పీడ్‌తో లెనొవో కే 8 నోట్

రోజుకో కొత్త ఫోన్ మార్కెట్‌లోకి దూసుకొస్తున్న రోజులివి. ఒక దాని మించి ఒకటి మంచి ఫీచ‌ర్ల‌తో నువ్వానేనా అన్న‌ట్లు పోటీప‌డుతున్న‌యి టెలిఫోన్ దిగ్గ‌జాలు. జీబీ, కెమెరా, టోట‌ల్ డిజైన్‌ల‌లో మార్పుల‌తో యూజ‌ర్ల నుంచి మార్కులు కొట్టేయ‌డానికి ఈ కంపెనీలు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. ఈ నేప‌థ్యంలో వచ్చిందే లెనొవొ కే8 నోట్‌. గ‌తంలో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను దింపి అంద‌ర్ని ఆక‌ట్టుకున్న లెనొవొ. త‌న కే సిరీస్‌లో మ‌రో ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే లెనొవొ కే 8 నోట్‌. 

కిల్ల‌ర్ స్పీడ్‌తో...
లెనొవొ కే8 నోట్‌ను ఇటీవ‌లే దిల్లీలో విడుద‌ల చేసింది లెనొవొ సంస్థ‌. దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే దీని వేగం.  కిల్ల‌ర్ స్పీడ్‌తో ర‌న్ కావ‌డ‌మే  ఈ లెనొవొ కే8 నోట్ ప్ర‌త్యేక‌త‌. 4 జీబీ సామ‌ర్థ్యం ఉన్న ఈ ఫోన్‌ను రూ.13999కు అమ్ముతున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. 3 జీబీ సామ‌ర్థ్యం ఉన్న ఫోన్‌ను రూ.12999కు అమ్ముతున్నారు. 4జీ సామ‌ర్థ్యం ఉన్న ఫోన్‌ను 64 మెమెరీ సామ‌ర్థ్యం ఉంటు, 3 జీబీకి 32 జీబీ సామ‌ర్థ్యం ఉంది.  అంతేకాదు కే7 నోట్ మోడ‌ల్‌లో లేని ఫీచ‌ర్లు దీనిలో ఉన్నాయి. ఆగ‌స్టు 18న ఈ ఫోన్ భార‌త్‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రాబోతోంది. ఆండ్రాయిడ్ 7.1.1 వెర్ష‌న్‌తో వ‌చ్చిన ఈ ఫోన్ బ‌రువు 180 గ్రాముల బ‌రువుండి, 8.5 అంగుళాల మందంతో త‌యారైంది.  

ఐపీఎస్ ఎసీడీ ట‌చ్ స్క్రీన్‌
కే8 నోట్ ఫోన్‌ను ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ ట‌చ్ స్క్రీన్‌తో త‌యారు చేశారు. కొరింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ఇది సేఫ్‌గా కూడా ఉంటుంది. డ్యుయ‌ల్ సిమ్ స్లాట్‌, స్ప్లాష్ రెసిస్టెంట్ మ‌రో ఆప్ష‌న్‌. డెకాకోర్ 2.3 గిగా హెట్జ్ సామ‌ర్థ్యంతో త‌యారైన ఈ ఫోన్‌లో 13 ఎంపీ డ్యుయ‌ల్ రేర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫేజ్ డిటెక్ష‌న్‌, ఆటోఫోక‌స్‌, డ్యుయ‌ల్ ఎల్ఈడీ (డ్యుయ‌ల్ టోన్‌) ఫ్లాష్ దీనిలో ఉన్నాయి.  అన్నిటిక‌న్నా 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌. 

జన రంజకమైన వార్తలు