• తాజా వార్తలు
  •  

తొలి 4 కెమెరా ల ఫోన్

చైనా కు చెందిన హ్యండ్ సెట్ తయారీదారు అయిన ప్రో ట్రూలీ గత సంవత్సరం మొబైల్ ఇండస్ట్రీ లోనికి అడుగుపెట్టింది. గత నవంబర్ లో ఇది డార్లింగ్ D7 మరియు డార్లింగ్ D8 అనే రెండు స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసింది.360 డిగ్రీ ల కెమెరా ను అందించిన మొట్టమొదటి కంపెనీ ఇది. అయితే ఇప్పుడు తాజాగా మరొక సంచలన ఉత్పాదనను తెరపైకి తీసుకురావడం ద్వారా తన పేరును మరింత పెంచుకోవాలి అనుకుంటుంది. అదే ప్రో ట్రూలీ V 10 . చైనా కు చెందిన టెలికాం రెగ్యులేటర్ అయిన టీనా యొక్క జాబితా లో ఇది పేరు సంపాదించింది.

ఇదే మోడల్ గత నెలలో అనేక ప్రముఖ టెక్ వెబ్ సైట్ లన్నింటిలోనూ దర్శనమిచ్చింది. వీటి ప్రకారం ఇది ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో మరియు 4 GB RAM తో లభిస్తుంది.ఇది 2.0 GHz MT6797T డెకా కోర్ ప్రాసెసర్ ను ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ నుండి వస్తున్న మూడవ స్మార్ట్ ఫోన్ ఇది.

ఇది 1920 x 1080 పిక్సెల్ రిసోల్యూషన్ తో కూడిన 5.5 ఇంచ్ TFT స్క్రీన్ ను కలిగిఉంటుంది. ఇది ప్రో ట్రూలీ యొక మొదటి రెండు మోడల్ లను పోలిన డిస్ప్లే. ఇందులో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది. తదుపరి ఎస్ డి కార్డు ద్వారా 256 GB వరకూ ఎక్స్ పాండ్ చేయవచ్చు. 4 జి LTE కనెక్టివిటీ ని మరియు 3200 mAh బ్యాటరీ కెపాసిటీ ని కలిగిఉంటుంది.

ఇంతవరకూ అంతా మామూలు గానే ఉంది కదా! ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. మామూలు స్మార్ట్ ఫోన్ ల మాదిరిగా కాకుండా ఇందులో నాలుగు కెమెరా లు ఉండనున్నాయి. రెండు ఫ్రంట్ కెమెరా లు మరియు రెండు రేర్ కెమెరా లు మొత్తం నాలుగు కెమెరా లతో ఇది రానుంది. రేర్ కెమెరా 13 MP మరియు 16 MP RGB సెన్సార్ లతో రానుంది. దీనివలన సెల్ఫీ లు మరింత నాణ్యం గా ఉండనున్నాయి. ఇది పార్టి స్థాయి మెటల్ బాడీ ని కలిగి ఉండనుంది. ఇది 168 x 77.3 x 8.05 డైమెన్షన్ లు మరియు 183 గ్రాము ల బరువు ను కలిగి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు