• తాజా వార్తలు
  •  

తొలి  ఫిడ్జెట్ స్పిన్న‌ర్ క‌మ్ డ్యూయ‌ల్ సిమ్ మొబైల్ 899 రూపాయ‌ల‌కే లాంచ్ అయింది..

ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌..  స్కూల్ పిల్ల‌ల నుంచి సాఫ్ట్‌వేర్ యూత్ వ‌ర‌కు ఇప్పుడు ఇదో క్రేజ్‌. దీన్ని వేళ్ల మ‌ధ్య ప‌ట్టుకుని తిప్పితే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతామ‌ని కూడా చెబుతున్నారు. ఆ మాట ఎలా ఉన్నా ఇప్పుడు అంద‌రికీ అదో క్రేజీ వ‌స్తువు. అదిగో ఆ క్రేజ్‌నే  బిజినెస్ చేసుకోవాల‌నుకుంటోంది చిల్లీ మొబైల్స్ సంస్థ‌. ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌లా వాడుకోగ‌లిగే చిన్న ఫీచ‌ర్ ఫోన్‌ను త‌యారు చేసింది. దీనిపేరు K188.

ఏంటి స్పెషాలిటీ

ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌కు ఉన్న‌ట్లే దీనికీ మ‌ధ్య‌లో ప్రెస్ బ‌ట‌న్‌లాంటిది ఉంటుంది. దీన్ని ప‌ట్టుకుని వేళ్ల మ‌ధ్య ఫోన్‌ను గింగిరాలు తిప్పొచ్చు.  స్ట్రెస్ రిలీఫ్ కోసం ఫిడ్జెట్ స్పిన్న‌ర్‌లా, ఫోన్‌లా కూడా వాడుకోవ‌చ్చు.  దీన్ని మీ ద‌గ్గ‌రున్న ఫోన్‌తో పెయిర్ చేసి (బ్లూటూత్ డ‌య‌ల‌ర్‌గా) వాడుకోవ‌చ్చు. లేదా నేరుగా వాడుకోవాలంటే ఇది డ్యూయ‌ల్ సిమ్స్‌తో ప‌ని చేస్తుంది.  రెండు మైక్రో  సిమ్ కార్డ్ స్లాట్‌లు ఉన్నాయి.  ఐదు బ్రైట్ క‌ల‌ర్స్‌లో దొరుకుతుంది. ధ‌ర 899 రూపాయ‌లు. (14 డాల‌ర్లు) 

ఫీచ‌ర్లు

*  1.44 ఇంచెస్ డిస్‌ప్లే  (128 x 128  పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌) 

* కాంటాక్స్ట్‌ఎస్ఎం ఎస్‌ల స్టోరేజ్‌కి 32 ఎంబీ ర్యామ్‌, 32 ఎంబీ రామ్  

* ఆల్ఫా న్యూమ‌రిక్ కీబోర్డ్ 

*  800mAh బ్యాట‌రీ 

* పాలీ కార్బొనేట్ షెల్‌. 

* మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌, మ్యూజిక్ ప్లేయ‌ర్‌, ఆడియో జాక్ వంటి ఫీచ‌ర్లేవీ లేవు.

*   సంవ‌త్స‌రం వారంటీ కూడా ఉంది.

ఫైన‌ల్‌గా చెప్పాలంటే ఈ ఫోన్ మీకు ప్రైమ‌రీ ఫోన్‌గా ప‌నికివ‌స్తుందంటే చెప్ప‌లేం. కానీ బ్లూటూత్ డ‌య‌ల‌ర్‌గా బాగా ప‌నికొస్తుంది. ట్రెండీగా ఉంటుంది.  ధ‌ర త‌క్కువ‌, ఫిడ్జెట్ స్పిన్న‌ర్ లా ఉండ‌డంతో స‌ర‌ద‌గా వాడుకోవ‌డానికి బాగుంటుంది

 

జన రంజకమైన వార్తలు