• తాజా వార్తలు
  •  

ఐఫోన్ టెన్ పోలిక‌ల‌తో ఫోన్లు షురూ.. మొద‌టిది గూ ఫోన్ టెన్ @6500

ఐ ఫోన్ ఫ్యాన్స్ ఎంతో యాంగ్జ‌యిటీగా ఎదురుచూసిన ఐ ఫోన్ టెన్  (iPhone X ) వ‌చ్చేసింది. ఐ ఫోన్ టెన్త్ యానివ‌ర్స‌రీ ఎడిష‌న్‌గా వ‌చ్చిన ఈ ఫోన్ ఖ‌రీదు దాదాపు 80 వేలు. అమ్మో అంత రేటా అనుకుంటే అలాంటి రూపురేఖ‌ల‌తో ఓ ఫోన్ ఉంది. ధ‌ర 6,500 మాత్ర‌మే.  పేరు గూఫోన్ టెన్  (Goophone X). చూడ‌డానికే ఐఫోన్ టెన్‌లా ఉంటుంది ఒక్క‌సారి ప‌ట్టుకుంటే ఇమిటేష‌న్ అని ఇట్టే తెలిసిపోతుంది.
ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ అన్నీ క్లోన్
శాంసంగ్‌, నోకియా, యాపిల్ లాంటి మెగా బ్రాండ్ల నుంచి వ‌చ్చిన అత్యంత ఖ‌రీదైన ఫోన్ల‌కు సేమ్ అదే ఆకృతితో అతి చౌక‌గా క్లోన్స్ త‌యారుచేసే చైనీస్ కంపెనీ గూఫోన్‌. శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లోని టాప్ ఫోన్ల‌తోపాటు ఐ ఫోన్ల‌నూ పోలిన ఫోన్లు త‌యారుచేసింది. ఇప్పుడు ఏకంగా ఐ ఫోన్ టెన్‌కే ఇమిటేష‌న్ ఫోన్ దింపేసింది. దీని ఖ‌రీదు 6,500. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ప‌ని చేస్తుంది.
 అంతా మాయే 
చూడ‌డానికి అచ్చం ఐ ఫోన్ టెన్‌లా క‌నిపించే ఈ ఫోన్లు ఫీచ‌ర్ల‌న్నీ కూడా మాయే.  ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ ప్లే, కెమెరా ప్లేస్‌మెంట్ వంటివ‌న్నీ ఐఫోన్ టెన్లానే ఉంటాయి. 5.5 ఇంచెస్ డిస్ ప్లే, మీడియాటెక్ 6580 క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌,. 1జీబీ ర్యామ్‌, 2,100 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్నాయి.  ఇక మిగిలిన ఫీచ‌ర్లు చూపించేదానికి, నిజంగా ఉన్న‌వాటికి పోలికే ఉండ‌దు. 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజి అంటారు కానీ 8 లేదా 16 జీబీ మాత్ర‌మే ఉంటుంది. 13 ఎంపీ రియ‌ర్‌, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా అని చూపిస్తుంది. కానీ 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలే ఉంటాయి.  ఆండ్రాయిడ్ 7.0 ఓఎస్ అంటారు ఆండ్రాయిడ్ 5.0 ఓఎస్సే ఉంటుంది. 4G LTE status డిస్‌ప్లేలో చూపించినా 3జీ స‌ర్వీసులకు మాత్ర‌మే ప‌నికొస్తుంది.  

 

జన రంజకమైన వార్తలు