• తాజా వార్తలు

6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజితో రిలీజ‌యిన హానర్ 8 ప్రో


 

స్మార్ట్‌ఫోన్ల‌లో అత్యంత కీల‌క‌మైంది ర్యామ్. ఫోన్ పెర్‌ఫార్మెన్స్‌కు గుండెకాయ లాంటి ర్యామ్ గురించి ఇప్పుడు యూజ‌ర్లంద‌రికీ బాగా ఎవేర్‌నెస్ వ‌చ్చింది. దీంతో కంపెనీలు కూడా ర్యామ్ మీదే దృష్టి పెట్టాయి. ఒక‌ప్పుడు 2జీబీ ర్యామ్ ఫోన్లు రాజ్య‌మేలితే.. త‌ర్వాత 3 జీబీ హంగామా చేసింది. ఇప్పుడు 4 జీబీ ట్రెండ్ న‌డుస్తోంది. ఇక హువావే కంపెనీ త‌న  సబ్సిడరీ బ్రాండ్ Honor నుంచి 6జీబీ ర్యామ్‌తో ఫోన్‌ను ఇండియ‌న్ మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది.   హానర్ 8 ప్రో పేరుతో విడుదలైన హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్  ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్న హానర్ 8 మోడ‌ల్‌కు అప్‌గ్రేడేష‌న్‌.  


వ‌న్‌ప్ల‌స్ 5కి కాంపిటీష‌న్‌గా..
6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజితో రిలీజ‌యిన హాన‌ర్ 8 ప్రో ధ‌ర 29,999 రూపాయ‌లు. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ 5 ఉంది. అయితే 6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజితో వ‌చ్చిన వ‌న్‌ప్ల‌స్ 5 ప్రైస్ 32,999 రూపాయ‌లు. ధ‌ర త‌క్కువ‌గానూ, ర్యామ్ ఎక్కువ‌గానూ ఉన్నా వ‌న్‌ప్ల‌స్‌తో హాన‌ర్ పెర్‌ఫార్మెన్స్‌ను కంపేర్ చేయ‌డం క‌ష్ట‌మైన ప‌నే అంటున్నారు టెక్ ఎక్స్‌ప‌ర్ట్‌లు. 

 స్పెసిఫికేషన్స్ 
*  1440× 2560 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో  5.7 ఇంచెస్ క్యూ హెచ్డీ  ఎల్టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
* ఆక్టా కోర్ ప్రాసెసర్ 
*  6జీబి ర్యామ్ 
* 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( మైక్రోఎస్డీ కార్డ్‌తో మ‌రో 128 జీబీఎక్స్‌పాండ‌బుల్‌)  
*  12 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరా. ఎల్ఈడీ ఫ్లాష్‌, 4కే వీడియో రికార్డింగ్ 
* 77 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో   8 ఎంపీ   ఫ్రంట్ కెమెరా 
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 
 *   EMUI 5.1 కస్టమ్ స్కిన్‌తో  డ్రాయిడ్ 7.0 నూగ‌ట్ ఓఎస్