స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్‌లో ర్యామ్, ప్రాసెసర్లకు ఎంత ప్రిఫరెన్స్ ఉందో బ్యాటరీకి అంతే ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఫోన్ ఎంత గొప్పగా ఉన్నా బ్యాటరీ బ్యాకప్ బాగాలేకపోతే మార్కెట్లో ఫెయిలవడం ఖాయం. మోటోలాంటి పెద్ద పెద్ద కంపెనీల ఫోన్లు వెనకబడితే షియోమి లాంటి కంపెనీలు సక్సెస్ అవడానిక ప్రధాన కారణం బ్యాటరీ బ్యాకప్పే. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇన్ఫోకస్ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులపాటు వాడుకోవచ్చు.
\ధర తక్కువే..
టర్బో పేరుతో ఇన్ఫోకస్ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ రేంజ్ ఫోన్. 2జీబీ, 3జీబీ ర్యామ్‌తో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. వీటి ధరలు 6,999, 7,999 రూపాయలు. బడ్జెట్ రేంజ్లో ఇండియన్ మార్కెట్లో దూసుకుపోతున్న రెడ్మీ 4తో ఈ ఫోన్ పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటరీ ఒక్కటే కాదు పెర్ఫార్మెన్స్ కూడా క్లిక్కయితే ఈ ఫోన్ రెడ్మీ 4కు పోటీఇవ్వగలుగుతుంది. జూలై 4 నుంచి అమెజాన్‌లో లభించనుంది.
స్పెసిఫికేషన్లు
* 1280x720 రిజల్యూషన్ తో 5.2 ఇంచెస్ డిస్ప్లే
* 1.25 క్వాడ్- కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్
* 13 ఎంపీ రియర్ కెమెరా
* 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 2జీబీ/3 జీబీ ర్యామ్
* 16 జీబీ / 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (ఎక్స్‌పాండబుల్ విత్ మైక్రో ఎస్డీ కార్డ్)
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ