• తాజా వార్తలు
  •  

6జీబీ ర్యామ్‌తో లేటెస్ట్‌గా వ‌చ్చిన 7స్మార్ట్‌ఫోన్లు ఇవే 

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అంతులేని  పోటీ ఉంది.  యూజ‌ర్‌ను ఆక‌ట్టుకోవాలంటే కొత్త కొత్త స్పెక్స్ ఉండాలి. అల్టిమేట్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వాలి. స్టైలిష్ లుక్‌, సూప‌ర్ బ్యాట‌రీ బ్యాక‌ప్ ఇవ‌న్నీ అవ‌స‌రం. వీట‌న్నింటి కంటే ముందు  మంచి ర్యామ్ ఉండాలి. అందుకే ఇప్పుడు కంపెనీలన్నీ 3జీబీ, 4జీబీ దాటి నేరుగా 6జీబీ ర్యామ్ కాంపిటీష‌న్లోకి దూకేశాయి.  లేటెస్ట్‌గా 6జీబీ ర్యామ్‌తో వ‌చ్చిన ఏడు స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇదీ.. 
వ‌న్‌ప్ల‌స్ 5టీ
త‌క్కువ ధ‌ర‌లోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అందిస్తున్న వ‌న్‌ప్ల‌స్ నుంచి లేటెస్ట్‌గా వ‌చ్చిన  ఫోన్ ఇది.  6జీబీ, 8జీబీ ర్యామ్  వేరియంట్ల‌తో రిలీజ‌యింది.  ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెసర్‌తో మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు.   6.01 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్  ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే, 3,300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్నాయి.  ఆండ్రాయిడ్ 7.1.1 నోగ‌ట్ వోస్‌తో న‌డిచే  ఈఫోన్‌లో  ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ ఉన్నాయి.  రియ‌ర్ సైడ్‌లో 20 ఎంపీ సోనీ IMX376K కెమెరా, ఫ్రంట్‌లో 16 ఎంపీ సోనీ  IMX 371 కెమెరాల‌తో సూప‌ర్ క్వాలిటీ ఇమేజెస్ తీసుకోవ‌చ్చు.   6జీబీ వేరియంట్ ధ‌ర‌  32,999 నుంచి, 8జీబీ వేరియంట్ 37,999 రూపాయ‌లు.  
శాంసంగ్ గెలాక్సీ నోట్‌8
శాంసంగ్ నుంచి వ‌చ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫ్యాబ్లెట్ 6.3 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్  అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే,  2960x1440 పిక్సెల్స్‌తో డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా, డెప్త్‌గా ఉంటుంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెసర్‌తో ప‌వ‌ర్‌ఫుల్‌గా త‌యారుచేశారు.  ఆండ్రాయిడ్ 7.1.1 నోగ‌ట్ ఓఎస్‌తో ర‌న్న‌వుతుంది. శాంసంగ్ సొంత డిజిట‌ల్ అసిస్టెంట్ బిక్స్‌బీ దీనిలో ఎక్స్‌ట్రా అట్రాక్ష‌న్‌.  12ఎంపీ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్‌, ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ప్రైస్ 67,900 
షియోమి ఎంఐ మిక్స్ 2
ఎంఐ మిక్స్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన ఈ ఫోన్‌లో దాదాపు బీజిల్‌లెస్ డిస్‌ప్లే ఉంది.  అల్యూమినియం ఛాసిస్‌, సిరామిక్ బ్యాక్ ప్యాన‌ల్ ఫోన్‌కు స్టైలిష్ లుక్‌నుస‌ ఇస్తున్నాయి.  5.99 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,  స్నాప్‌డ్రాగ‌న్ 835 ఎస్‌వోసీ, 6జీబీ ర్యామ్.  5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమౌల్డ్ డిస్‌ప్లే, 3,300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్నాయి.  రియ‌ర్ సైడ్‌లో 12 ఎంపీ సోనీ IMX38 కెమెరా ఉంది. 4కే వీడియో రికార్డ్ చేసుకోవ‌చ్చు.  ఫ్రంట్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ లింక్ చేశారు.  ఆండ్రాయిడ్ 7.0 నోగ‌ట్ ఓఎస్‌తో న‌డుస్తోంది. ఈ నెల‌లో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్ వ‌స్తుంది.   ధ‌ర  35,999 
కూల్‌పాడ్ కూల్ ప్లే 6
6జీబీ ర్యామ్ ఫోన్ల‌లో అతి త‌క్కువ ధ‌ర‌కు దొరికే ఫోన్ ఇదే. 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఫింగర్‌ప్రింట్ సెన్స‌ర్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగ‌ట్ ఓఎస్‌తో ర‌న్న‌వుతుంది. 1.4 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్ ఉంది.   13 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌, ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీకెమెరాల‌తో 4కే వీడియాలు కూడా షూట్ చేసుకోవ‌చ్చు. ప్రైస్  14,99 
ఓపో ఎఫ్ 3 ప్ల‌స్ 
ఓపో త‌న సెల్ఫీ ఎక్స్‌ప‌ర్ట్‌ల్లో ఒక‌టైన ఓపో ఎఫ్‌3 ప్ల‌స్‌లో కూడా రీసెంట్‌గా 6జీబీ ర్యామ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. 6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌తో వ‌చ్చింది.  1.95 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగ‌న్ 653 ప్రాసెస‌ర్ ఉంది. 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ను 256 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు.  ఫ్రంట్ 16 ఎంపీ, 8 ఎంపీ వైడ్ యాంగిల్  మోడ్‌లో రెండు సెల్ఫీ కెమెరాలు దీని స్పెషాలిటీ.  ప్రైస్ 22,990.
ఓపో ఎఫ్‌5 
ఓపో  నుంచి వ‌చ్చిన మ‌రో 6జీబీ ర్యామ్ ఫోన్ ఇది. 20 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతొనాటె ఏఐ బ్యూటీ రిక‌గ్నైజేష‌న్ టెక్నాల‌జీ ఉంది.  200 ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ స్పాట్స్‌తో మీ సెల్ఫీని మ‌రింత బ్యూటీఫుల్‌గా మారుస్తుంది.  ఫ్రంట్ కెమెరాతో ఫేస్ అన్‌లాక్ కూడా చేయొచ్చు. 6 ఇంచెస్ ఫ‌ల్ వ్యూ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న‌తో చూడ‌డానికి చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది.  2.5GHz మీడియాటెక్ హీలియో పీ23 ప్రాసెస‌ర్‌, ఆండ్రాయిడ్ 7.1 నోట్ ఓఎస్‌తో న‌డుస్తుంది. ధ‌ర  24,990.
ఇన్ఫినిక్స్ జీరో 5 
హాంకాంగ్ బేస్డ్ ఇన్ఫినిక్స్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది.   5.98 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1 నోగ‌ట్ ఓఎస్‌, 2.6 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్ ఉన్నాయి. 12, 13 ఎంపీ మెగాపిక్సెల్స్‌తో డ్యూయ‌ల్ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధ‌ర 19,999  

జన రంజకమైన వార్తలు