• తాజా వార్తలు
  •  

సెల్‌ఫోన్ ఇన్స్యూరెన్స్‌లో విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ .. మ్యాట్రిక్స్

మొబైల్ ఫోన్ ఎంత ఖ‌రీదైనది అయితే అంత ఆందోళ‌న‌. ఎవ‌రైనా కొట్టేస్తే లేదు మ‌న చేతిలో నుంచే జారిప‌డితే ఎంత డ‌బ్బులు పోసి కొన్న‌దైనా ఇక అంతే సంగ‌తులు. ఇన్స్యూరెన్స్ ఉంటే అంత బాధ ఉండ‌దు. రీప్లేస్ లేదా స‌ర్వీస్ ఏదో ఒక‌టి చేస్తారు. అలాంటి ఇన్స్యూరెన్స్ స్కీమ్‌నే  సెల్‌ఫోన్ల కోసం తీసుకొచ్చింది మ్యాట్రిక్స్‌.  మొబైల్ ఫోన్ ఇన్స్యూరెన్స్‌లో ఇదో కీలక మ‌లుపు కాబోతోంది.  
మ్యాట్రిక్స్ సెల్యుల‌ర్ ఆప‌రేటింగ్ మ్యాట్రిక్స్ బ్రాండ్ నేమ్‌తో  మొబైల్ ప్రొటెక్ష‌న్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.  ఇండియాలో లేదంటే బ‌య‌టి దేశాల్లో కొన్న సెల్‌ఫోన్ల‌కు కూడా ఈ ఇన్స్యూరెన్స్ ప్లాన్ వ‌ర్తిస్తుంది. అలియాన్జ్ గ్లోబ‌ల్ అసిస్టెన్స్‌తో ఈ ప్లాన్ ప‌ని చేస్తుంది. 10 వేల నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్స్యూరెన్స్ క‌వ‌ర్ తీసుకోవ‌చ్చు. ప్రీమియం నామిన‌ల్‌గా ఉంటుంది. ఐవోఎస్,  విండోస్, ఆండ్రాయిడ్ ఏ స్మార్ట్‌ఫోన్‌కైనా ఇన్స్యూరెన్స్ చేస్తారు. ఫోన్ తీసుకున్న ఏడాదిలోపు ఇన్స్యూరెన్స్ చేయించుకోవ‌చ్చు.
ఇన్స్యూరెన్స్ ఎప్పుడు క‌వర్ అవుతుంది?  
*  ఫోన్ ఎవ‌రైనా దొంగిలించినా  
* ప్ర‌మాద‌వ‌శాత్తూ డ్యామేజ్ అయినా 
* ఏదైనా లిక్విడ్ వంటివి ప‌డి లేదా నీళ్ల‌లో ప‌డి డ్యామేజ్ అయినా ఇన్స్యూరెన్స్ క్లెయిం చేసుకోవ‌చ్చు. 
 
వెంట‌నే అసిస్టెన్స్ ఇస్తారు. వాళ్లే వ‌చ్చి మొబైల్‌ను తీసుకెళ్లి  క్యాష్‌లెస్ రిపేర్ చేసి మ‌ళ్లీ తీసుకొచ్చి ఫోన్ అప్ప‌చెబుతారు.  మొత్తంగా ప్రాబ్ల‌మ్ టైమ్‌లీగా రిజాల్వ్ అవుతుందని కంపెనీ భ‌రోసాగా చెబుతోంది.   
ఎలా తీసుకోవాలి? 
ఈ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే  www.matrix.in  వెబ్‌సైట్‌లోకి వెళ్లి తీసుకోవ‌చ్చు.  లేదా  Matrix Travel Companion యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్స్యూరెన్స్ తీసుకోవ‌చ్చు. లేదంటే  Matrix Call Centerకు కాల్ చేస్తే ఇన్స్యూరెన్స్ తీసుకునే ప్రొసీజర్ చెబుతారు. 

జన రంజకమైన వార్తలు