ఐఫోన్ సింగిల్ సిమ్ మాత్రమే వేసుకోగలం. ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్‌లో అన్ని యాప్స్ దాదాపు ఫ్రీయే. ఐ స్టోర్‌లో అలా కాదు.. ఇలా నిట్టూర్పులు విడిచేవారికి కొత్త జోష్ తెచ్చే మంత్రం వచ్చేసింది. ఐ ఫోన్లోనూ డ్యూయల్ సిమ్ వాడగలిగేలా, అవసరమైతే దాన్ని ఆండ్రాయిడ్లా వాడుకోగలిగేలా స్మార్ట్ కేస్ వచ్చేసింది. Haimawan అనే చైనా కంపెనీ.. మీసూట్ (Mesuit) పేరుతో మార్కెట్లోకి తెచ్చిన ఈ స్మార్ట్కేస్ విశేషాలు చూడండి..
మీసూట్ స్మార్ట్కేస్ కేవలం ఐ ఫోన్ యూజర్లు మాత్రమే వాడగలిగే ప్రత్యేక హార్డ్‌వేర్ తో తయారైంది. ఈకేసుకు మోడెం, బ్యాటరీ, సెపరేట్ మెమరీ, యాప్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ కేస్‌లోMesuit యాప్ డౌన్లోడ్ చేసి ఐ ఫోన్‌ను పెట్టి బ్లూ టూత్ ద్వారా యాప్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఐ ఫోన్‌ను ఆండ్రాయిడ్‌గా కూడా వాడుకోవచ్చు. రెండు సిమ్లతోనూ వాడుకోవచ్చు.
మీసూట్ స్మార్ట్కేస్ స్పెసిఫికేషన్లు
* మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్
* 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( ఐఫోన్లో స్టోరేజ్ నిండితే దీనిలోకి ఫైల్స్‌ను మూవ్ చేసుకోవచ్చు)
* ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్ (ఏడుగంటల టాక్‌టైమ్ ఇస్తుంది)
* మీసూట్ స్మార్ట్కేస్ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రెండేసి అకౌంట్లను ఈ ఫోన్లోనే యూజ్ చేసుకునే సౌలభ్యం ఉంది.
ఐఫోన్ 6, 6ఎస్ మోడల్స్‌కు మాత్రమే..
ప్రస్తుతానికి మీసూట్ స్మార్ట్ కేస్ ఐఫోన్6, ఐ ఫోన్ 6 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లకు మాత్రమే వర్కవుట్ అవుతుంది. ఇండియాలో ఈ స్మార్ట్ కేస్‌ను yerha.com వెబ్ సైట్లో మాత్రమే అమ్మతున్నారు. దీని ధర 9,990 రూపాయలు. ఆరు నెలల గ్యారంటీ ఇస్తారు.