• తాజా వార్తలు
  •  

ప్ర‌పంచ‌పు అతి చిన్న జీఎస్ఎం నానో ఫోన్ ఇండియాలో రిలీజ్ అయ్యిందోచ్‌.. 

ర‌ష్య‌న్ కంపెనీ ఎలారీ ప్రపంచ‌పు అతి చిన్న జీఎస్ఎం ఫోన్ నానో ఫోన్ సీని ఇండియాలో రిలీజ్ చేసింది.  దీనికి ముందు జులైలో ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ ఫోన్‌ను రిలీజ్ చేసిన ఎలారీ ఇప్పుడు ధ‌ర త‌గ్గించి మ‌రిన్ని ఫీచ‌ర్లతో నానో ఫోన్ సీని తీసుకొచ్చింది.  చిన్న ఫోన్ల సెగ్మెంట్‌లో త‌మ‌ది చాలా ప‌వ‌ర్‌ఫుల్ ఫోన్ అని, త్వ‌ర‌లో మ‌రో వేరియంట్‌ను కూడా ఇండియాలో రిలీజ్ చేస్త‌మాని ఎలారీ ప్ర‌క‌టించింది. 
ఫీచ‌ర్లు
* 94.4  ఎంఎంఎక్స్‌, 35.85 ఎంఎంఎక్స్ మెజ‌ర్‌మెంట్స్‌తో వ‌చ్చిన ఈ ఫోన్ బ‌రువు జ‌స్ట్ 30 గ్రాములు
* 1 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే
*మీడియాటెక్ MT6261D  ప్రాసెస‌ర్‌, 32 ఎంబీ ర్యామ్‌
* RTOS ఓఎస్‌తో ర‌న్న‌వుతుంది
* 32 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌.  టీ ఫ్లాష్ కార్డ్‌తో 32 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్‌
* బ్లూటూత్ కాల్ రికార్డ‌ర్‌, కాలిక్యులేట‌ర్‌, ఎంపీ 3 ప్లేయ‌ర్‌, ఎఫ్ఎం రేడియో, అలారం
* మేల్‌, ఫిమేల్‌, చైల్డ్ ఇలా మీ వాయిస్‌ను మార్చుకోగ‌లిగే మ్యాజిక్ వాయిస్ ఫంక్ష‌న్ 
* బ్లూటూత్‌తో పెయిర్ చేసి ఆండ్రాయిడ్‌, ఐఫోన్ల‌కు స్టాండ్‌బైగా వాడుకోవ‌చ్చు. 
* 1000 కాంటాక్ట్స్‌ను స్టోర్ చేసుకోవ‌చ్చు.
* 280 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాట‌రీ ఉంది. 4 గంట‌ల టాక్ టైం, 4 రోజుల స్టాండ్ బై ఇస్తుంది.

ఎక్క‌డ దొరుకుతుంది?
Yerha.com అనే ఈ-కామ‌ర్స్ పోర్ట‌ల్లో మాత్ర‌మే ఈ ఫోన్ దొరుకుతుంది.  ధ‌ర 2,999 రూపాయ‌లు.  రోజ్ గోల్డ్‌, సిల్వ‌ర్‌, బ్లాక్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. 

 

జన రంజకమైన వార్తలు