• తాజా వార్తలు
  •  

అద‌ర‌గొట్టే ఫీచ‌ర్ల‌తో వ‌చ్చేసింది నోకియా 6

మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నోకియా 6 ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చేసింది. మిగిలిన మొబైల్స్‌కు పోటీగా, మార్కెట్లో నిల‌దొక్కుకోవ‌డానికి కొత్త ఫీచ‌ర్ల‌తో అందుబాటులోకి వ‌చ్చింది నోకియా.  అమేజాన్ ఆన్‌లైన్ సైట్ ద్వారా ఈనెల 23 నుంచి అమ్మ‌కాలు మొద‌ల‌య్యాయి. అయితే నోకియా లాంటి దిగ్గ‌జ కంపెనీ మ‌ళ్లీ వ‌స్తుందంటే యూజ‌ర్లు కూడా భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే నోకియా కూడా అదిరే ఫీచ‌ర్ల‌తో నోకియా 6ను త‌యారు చేసింది. ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న మోటో జి5 ప్ల‌స్‌, జియోమి రెడ్‌మి నోట్ 4ల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని ఫీచ‌ర్లు నోకియా 6 ఫోన్ సొంతం. 

సూప‌ర్ క్లాస్ డిజైన్‌
డిజైన్ విష‌యంలో నోకియాది ఆరంభం నుంచి ముందంజే. అదే సంప్ర‌దాయాన్ని నోకియా 6లోనూ చూడొచ్చు. స్లిమ్ లుక్‌తో పాటు  బ‌ల‌మైన డిజైన్ తో ఈ ఫోన్ చూస్తేనే ఆక‌ట్టుకునే ఉంటుంది. అల్యూమినియంతో క్రాఫ్ట్ చేసిన స్లీక్ డిజైన్ ప్ర‌తి ఒక్క‌రిని క‌ట్టి ప‌డేస్తుందీ ఫోన్‌. స్లీక్ డిజైన్‌తో దీనికి సూప‌ర్ క్లాస్ లుక్ వ‌చ్చింది. మిల‌ట‌రీ ట్యాంక్ కంటే నోకియా 3310 ఫోనే గ‌ట్టిగా ఉంటుంద‌నే జోక్ నోకియా విష‌యంలో నిజ‌మే. అంత ప‌టిష్టంగా ఫోన్‌ రూపొందించ‌డం వ‌ల్లే నోకియా ప‌ట్ల ఇప్ప‌టికీ అభిమానం త‌గ్గ‌లేదు. హెచ్ఎండీ గ్లోబ‌ల్ మ‌న‌కు ఇదే అష్యూరెన్స్ ఇస్తుంది.

డిస్‌ప్లే అదుర్స్‌
5.5 అంగుళాల డిస్ ప్లే నోకియా 6 ఫోన్‌ను మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారుస్తుంది. ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌. 16:9 యాస్‌పెక్ట్ రేషియోలో ఇది త‌యారైంది. 450 నిట్ డిప్‌స్లే దీనికి ఉంది. దీనికి తోడు గొరిల్లా గ్లాస్ 3తో ఎలాంటి స్క్రాచ్‌ల ఇబ్బంది ఉండ‌దు. అన్నిటికంటే ముఖ్యంగా బోట‌మ్ లౌడ్ స్పీక‌ర్ మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఫీచ‌ర్‌.  నోకియా 6 ఫోన్ చాలా వెడ‌ల్పుగా ఉండి చేత్తో మ‌నం హోల్డ్ చేయ‌డం చాలా సుల‌భంగా ఉంటుంది. ఫోన్‌కు ఉన్న షార్ప్ ఎడ్జ్‌ల వ‌ల్ల కూడా మ‌న‌కు కంఫోర్ట‌బులిటీ పెరుగుతుంది. దీనికో రేర్ బ్యాక్ ప్యాన‌ల్ కూడా ఉంది. స్క్రాచ్ ప్రోన్‌గా ఇది త‌యారైంది. 

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగ‌ట్‌
నోకియా 6 ఆండ్రాయిడ్ 7.1.1 నౌగ‌ట్ లేటెస్ట్ వెర్ష‌న్‌తో త‌యారైంది. ఆండ్రాయిడ్‌లో ఉన్న ప్ర‌తి ఆప్ష‌న్  ఇందులో ఉంది. యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ మిగిలిన  ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగానే ఉంటుంది.  మిగిలిన పిక్స‌ల్ ఫోన్ల మాదిరిగానే ఇది కూడా ప‌ని చేస్తుంది.  స్పాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌తో వ‌ర్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా స్పీడ్ విష‌యంలో పోటీ ఫోన్ల‌కు ఏ మాత్రం తీసిపోదు.  అన్నిటిక‌న్నా ముఖ్యంగా ఆండ్రాయిడ్ 8.0 ఓరియా వెర్ష‌న్‌ను త్వ‌ర‌లోనే తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి. 3జీ ర్యామ్‌, ఎడ్రెనొ 505 జీపీయూ ఈ ఫోన్‌కు మ‌రి కొన్ని అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లు. 

సూప‌ర్ పిక్చ‌ర్ ఇమేజ్‌
నోకియా 6లో మ‌రో అద్బుత‌మైన ఫీచ‌ర్ కెమెరా. ఇది మిగిలిన ఫోన్ల క‌న్నా భిన్నం. 16 ఎంపీ కెమెరాతో మీకు స్ప‌ష్ట‌మైన ఫొటోలు తీసుకోవ‌చ్చు.  అన్నిక‌న్నా ముఖ్యంగా వీడియోల‌ను, ఫొటోల‌ను  ఒకేసారి తీసుకునే బోతీస్ ఆప్ష‌న్ గొప్ప ఇన్వెంష‌న్‌. సెల్ఫీ స్పెష‌లిస్ట్‌గా ఈ ఫోన్‌ను రూపొందించారు. 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు అదిర‌పోవ‌డం ఖాయం. అన్నిటిక‌న్నా ముఖ్యంగా 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ కూడా ఈ ఫోన్‌ను ప్ర‌త్యేకంగా నిల‌బెడుతుంది. ఓవ‌రాల్‌గా చూస్తే నోకియా 6 అద్భుత‌మే. మిగిలిన ఫోన్ల‌తో పోలిస్తే కొన్ని ఫీచ‌ర్లు లేక‌పోయినా.. ఇదో ఓవ‌రాల్ ప్యాకేజ్‌.

ధ‌ర: రూ.15000
ఆన్‌లైన్‌: అమేజాన్‌

జన రంజకమైన వార్తలు