• తాజా వార్తలు

గెలాక్సీ జే5ను అప్‌డేటెడ్ చేసి  జే5 ప్రో  తీసుకొచ్చిన శాంసంగ్ 

 


శాంసంగ్ గ‌త నెల‌లో రిలీజ్ చేసిన గెలాక్సీ జే 5 మోడ‌ల్‌కు అప్‌డేటెడ్ వెర్ష‌న్‌ను లేటెస్ట్‌గా థాయ్‌లాండ్‌లో రిలీజ్ చేసింది. గెలాక్సీ జే5 ప్రో అని పేరు పెట్టిన ఈ ఫోన్ ర్యామ్‌, ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వంటి విష‌యాల్లో ముందు మోడ‌ల్ కంటే అప్‌డేటెడ్ వెర్ష‌న్‌.  గెలాక్సీ జే5లో  2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మాత్ర‌మే ఉంది. మిగిలిన కంపెనీల‌న్నీ 4జీబీ ర్యామ్ తో వ‌స్తుండ‌డంతో శాంసంగ్ కూడా జే5ను అప్‌డేట్ చేసి 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మెమ‌రీతో జే5 ప్రోగా తీసుకొచ్చింది. థాయ్‌లాండ్లో దీని ధ‌ర మ‌న క‌రెన్సీ ప్ర‌కారం 19,000. త్వ‌ర‌లో ఇండియ‌న్ మార్కెట్ల్లోకి కూడా రాబోతోంది.   

గెలాక్సీ జే5 ప్రో స్పెసిఫికేష‌న్స్  
* 5.2 ఇంచెస్ హెచ‌డీ  సూప‌ర్ అమౌల్డ్  డిస్‌ప్లే 
* 1.6 గిగాహెడ్జ్  ఆక్టాకోర్ ప్రాసెసర్‌ 
* 3 జీబీ ర్యామ్‌ 
* 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (256 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండబుల్‌) 
*  రెండు వైపులా ఎల్ఈడీ ఫ్లాష్‌ల‌తో 13 మెగాపిక్సెల్ రియ‌ర్‌, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్  కెమెరా 
* 3000ఎంఏహెచ్‌ బ్యాటరీ 
* ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌
* ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్ ఓఎస్‌