మొబైల్ ఫోన్ కొనేముందు మనం ఆరాతీసే వాటిల్లో బ్యాటరీ ముందుంటుంది. ఎందుకంటే బ్యాటరీ ఎంత ఎక్కువసేపు వస్తే మనం మొబైల్‌ను అంత ఎక్కువసేపు వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. అందుకే ఫోన్ల కంపెనీలు కూడా ఒకదానితో ఒకటి పోటీపడి మరీ బ్యాటరీల సామర్థ్యాన్ని బాగా పెంచేశాయి. అయితే బ్యాటరీలు పేలడం, ఇంటర్నెట్ వాడకం పెరగడం వల్ల బ్యాటరీలు ఎక్కువసేపు నిలవకపోవడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిందే బ్యాటరీ లెస్ ఫోన్లు! నిజంగా ఈ ఆవిష్కరణ ఒక అద్భుతమే. ఎందుకంటే బ్యాటరీ ఇబ్బందులు తప్పుతాయి. మరి ఈ బ్యాటరీ లెస్ ఫోన్ ఎలా పని చేస్తుందో తెలుసా!
జీరో పవర్‌తో
సైంటిస్ట్‌లు డెవలప్ చేసిన బ్యాటరీ లెస్ ఫోన్లు జీరో పవర్‌తో పని చేస్తాయి. అంటే రేడియో సిగ్నల్స్, వెలుతురు ద్వారా ఇవి శక్తిని నింపుకుని ఆటోమేటిగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తాయి. పవర్‌తో పని లేకుండా బ్యాటరీ లెస్ ఫోన్ తయారు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. జాషువా స్మిత్ అనే సైంటిస్టు ల్యాబ్‌లో ఏడాది పాటు కఠిర పరిశ్రమ అనంతరం ఈ బ్యాటరీ లెస్ ఫోన్ రూపు దిద్దుకుంది. పవర్ లేకుండా పని చేసే బ్యాటరీ! వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు.అంటే చుట్టు పక్కల వాతావారణం నుంచి ఎనర్జీని గ్రహించి పని చేయడం ఈ బ్యాటరీ లెస్ ఫోన్ ప్రత్యేకత. యాంబియంట్ లైట్ ఆధారంగా ఇది పని చేస్తుంది. వీటిని గ్రహించడానికి సోలార్ ప్యానల్స్ ఉపయోగపడతాయి. లైట్ మాత్రమే కాదు రేడియా, టీవీ ఫ్రీక్వెన్సీలు, వైఫై బ్రాడ్కాస్టింగ్లను కూడా ఉపయోగించుని ఛార్జ్ కావడం ఈ బ్యాటరీ లెస్ ఫోన్ స్పెషల్.
800 మిల్లీ వాట్స్ మాత్రమే
కొద్దిసేపు ఫోన్ వాడితే చాలు వెంటనే బ్యాటరీ అయిపోవడం పెద్ద సమస్య. ఎంత ఛార్జింగ్ పెట్టినా మళ్లీ కాసేపటికే అది మాయం అవుతుంది. అయితే తాజాగా వచ్చిన బ్యాటరీ లెస్ ఫోన్లతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఐదు నిమిషాల కాల్‌కు ఇది కేవలం 800 మిల్లీ వాట్స్ శక్తిని మాత్రమే ఉపయోగించుకోవడం ఈ బ్యాటరీ లెస్ ఫోన్ ప్రత్యేకత. మామూలు ఫోన్లు అనలాగ్ హ్యుమన్ స్పీచ్‌ను డిజిటల్ సిగ్నల్స్ రూపంలోకి మార్చుతాయి. దీనికి చాలా పవర్ ఖర్చు అవుతుంది. అయితే బ్యాటరీ లెస్ ఫోన్ దీనికి భిన్నం. దీనిలో ఉన్న బాక్స్ కాటర్ టెక్నాలజీ ద్వారా ఇన్కమింగ్ రేడియో తరంగాలను బ్యాటరీ లెస్ ఫోన్ గ్రహిస్తుంది. దాని ద్వారా కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడం, తిరిగి కాల్ చేయడం లాంటివి చేయచ్చు. అయితే ఈ ఫోన్ పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి కొన్ని సాంతికేతిక సమస్యల్ని అధిగమించాల్సి ఉంది.