• తాజా వార్తలు
  •  

21 ప్రాంతీయ భాష‌ల‌ను స‌పోర్ట్ చేసే స్టార్స్ వైబ్ ఫోన్ @925 

జియో స్మార్ట్ ఫీచ‌ర్ ఫోన్ పుణ్య‌మా అని ఫీచ‌ర్ ఫోన్ల మార్కెట్‌కు మ‌ళ్లీ ఫోక‌స్ వ‌చ్చింది.  జియోకు పోటీగా ఎయిర్‌ట‌ల్‌, వొడాఫోన్ కూడా కార్బ‌న్ లాంటి బ్రాండ్ల‌తో టై అప్ చేసుకుంటున్నాయి. దీంతో ఈ కంపెనీలు మ‌ళ్లీ ఫీచ‌ర్ ఫోన్ల మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాయి.  ఈ ప‌రిస్థితుల్లో కాస్త కొత్త ఫీచ‌ర్లతో వ‌చ్చేవాటిని క‌స్ట‌మ‌ర్లు ఓ లుక్కేస్తున్నారు. 
ఢిల్లీ బేస్డ్ మొబైల్ త‌యారీ కంపెనీ జియోక్స్  మొబైల్స్ స్టార్స్ వైబ్ పేరుతో ఓ ఫీచ‌ర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ధ‌ర 925 రూపాయ‌లు. ఆఫ్‌లైన్లో మాత్ర‌మే దొరుకుతుంది.

21 భార‌తీయ భాష‌ల్ని, జీపీఆర్ఎస్‌ను స‌పోర్ట్ చేసే ఈ ఫోన్లో ఉన్న ఫీచ‌ర్లు  
*1.8 ఇంచెస్ డిస్‌ప్లే 
* 800 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* రియ‌ర్ కెమెరా   
* స్పీడ్ డ‌య‌ల్‌, డ్యూయ‌ల్ సిమ్‌, ఎస్డీ కార్డ్ స‌పోర్ట్  
* ఎఫ్ ఎం రేడియో
* మొబైల్ ట్రాక‌ర్‌
* ఆటో కాల్ రికార్డింగ్ ఫీచ‌ర్‌.

జన రంజకమైన వార్తలు