• తాజా వార్తలు
  •  

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన టాప్ ఫోన్లు ఇవీ 

మొబైల్ ఫోన్ల మాన్యుఫాక్చ‌రింగ్ సెక్ట‌ర్‌లో నెల‌కొన్న  హెవీ కాంపిటీష‌న్‌తో కంపెనీలు స‌ర్వైవ్ కావ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు టెక్నాల‌జీని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ స్పీడ్‌కు, పెర్‌ఫార్మెన్స్‌కు అత్యంత కీల‌క‌మైన ప్రాసెస‌ర్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. మీడియాటెక్ ప్రాసెస‌ర్లు బ‌డ్జెట్ రేంజ్ ఫోన్ల‌కే ప‌రిమిత‌మైపోయాయి. ఇక టాప్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్స్‌లో క్వాల్‌కామ్ ప్రాసెస‌ర్ల‌దే రాజ్యం. అందులోనూ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్ ఇప్పుడు హాట్‌కేక్‌.  ఈ ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రాసెస‌ర్ సూప‌ర్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌డంతో బ్యాట‌రీని కూడా త‌క్కువ‌గా యూజ్ చేసుకుంటోంది.  ప్ర‌స్తుతం ఇండియాలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన టాప్ ఫోన్లు ఇవీ.. 
 హెచ్‌టీసీ యూ11
ఒక‌ప్పుడు మొబైల్ ఫోన్ల‌లో మంచి మార్కెట్ ఉండి త‌ర్వాత వెన‌కబ‌డిపోయిన హెచ్‌టీసీకి ఇది ఒక‌ర‌కంగా కమ్ బ్యాక్ ఎడిష‌న్‌.   స్నాప్‌డ్రాగ‌న్ 835 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ పెర్‌ఫార్మెన్స్ అల్టిమేట్ అని కంపెనీ చెబుతోంది. 5.5 ఇంచెస్ 2కే డిస్‌ప్లే, ఐపీ 67 డ‌స్ట్‌, వాట‌ర్ ర‌సిస్టెన్స్‌, బూమ్ సౌండ్ హై ఫై ఎడిష‌న్ స్పీక‌ర్స్‌, రియ‌ర్‌సైడ్‌లో 12 ఎంపీ అల్ట్రా పిక్సెల్ రియ‌ర్ కెమెరా దీనికి ఉన్న ఇత‌ర స్పెసిఫికేష‌న్లు.  ఫాస్ట్ అండ్ ఫ్లూయిడ్ హెచ్‌టీసీ సెన్స్  UI atop ఆండ్రాయిడ్ నోగట్ ఓఎస్‌తో ర‌న్న‌వుతుంది. ధ‌ర  47,999  

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ 1 
 బెర్లిన్‌లో జ‌రిగిన ఐఎఫ్ఏ ఈవెంట్లో సోనీ  ఈ మోడ‌ల్‌ను రివీల్ చేసింది. సోనీ సిగ్నేచ‌ర్ ఓమ్నిబ్యాల‌న్స్ డిజైన్, కింద‌,పైన థిక్ బీజిల్స్‌తో వ‌చ్చిన ఈ ఫోన్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ ఉన్న 5.2 ఇంచెస్ ట్రైల్యూమినస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగ‌న్ 835 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌,  ఆడ్రినో 540 గ్రాఫిక్స్ ఉన్నాయి.  దీనిలో ఉన్న 3డీ క్రియేట‌ర్ యాప్  ఏఆర్ టెక్నాల‌జీతో 3డీ స్కానింగ్ చేయ‌గ‌ల‌దు.  ధ‌ర  44,990

వ‌న్‌ప్ల‌స్ 5 
త‌క్కువ ధ‌ర‌లోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అందిస్తున్న వ‌న్‌ప్ల‌స్ నుంచి వ‌చ్చిన ఖ‌రీదైన ఫోన్ ఇది. మెట‌ల్ యూనీబాడీతో వ‌చ్చిన ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 835 ఎస్‌వోసీ, ఎజీబీ ర్యామ్.  5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమౌల్డ్ డిస్‌ప్లే, 3,300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్నాయి.  ఫాస్ట్‌, ఫ్లూయిడ్ పెర్‌ఫార్మెన్స్ కోసం ఆక్సిజ‌న్ ఓఎస్ ఇచ్చారు. రియ‌ర్ సైడ్‌లో 16 ఎంపీ, 20 ఎంపీ లెన్స్‌ల‌తో డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ఈ సెక్ష‌న్‌లో వ‌న్‌ప్ల‌స్ 5ను టాప్‌లో నిల‌బెడుతోంది. ధ‌ర  32,999 నుంచి ప్రారంభం  

షియోమి ఎంఐ మిక్స్ 2
ఎంఐ మిక్స్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన ఈ ఫోన్‌లో దాదాపు బీజిల్‌లెస్ డిస్‌ప్లే ఉంది.  అల్యూమినియం ఛాసిస్‌, సిరామిక్ బ్యాక్ ప్యాన‌ల్ ఫోన్‌కు స్టైలిష్ లుక్‌నుస‌ ఇస్తున్నాయి.  5.99 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,  స్నాప్‌డ్రాగ‌న్ 835 ఎస్‌వోసీ, 6జీబీ ర్యామ్ఉన్నాయి. ధ‌ర  35,999 
గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్  
గూగుల్ సొంత ఫోన్లు గూగుల్ పిక్సెల్‌2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ కూడా ఈ స్నాప్‌డ్రాగ‌న్ 835 ఎస్‌వవోసీ తో వ‌చ్చిన‌వే. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ వ‌ర‌కు ఇంట‌ర్న‌ల్ స్టోరేజి ఇచ్చారు. క్యూ హెచ్‌డీ, పీ=ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ఐపీ 67 ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో స్పీక‌ర్స్‌తో వ‌చ్చిన  ఈఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ తో వ‌చ్చిన ఈ ఫోన్‌లో మూడేళ్ల‌పాటు ఓఎస్ అప్‌డేట్లు ఇస్తామ‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ధ‌ర 64 వేల‌కుపైగా  
 నోకియా 8 
హెచ్ఎండీ గ్లోబ‌ల్ టేకోవ‌ర్ చేసిన త‌ర్వాత నోకియా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ ట్రూ ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. 5.3 ఇంచెస్ క్యూ హెచ్‌డీ డిస్‌ప్లే, 6000 అల్యూమినియం సిరీస్‌తో త‌యారైంది.  స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌,  4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, స్టాక్ ఆండ్రాయిడ్ నోగ‌ట్ ఓఎస్ తో సెప్టెంబర్‌లో ఈ ఫోన్ రిలీజ‌యింది. త్వ‌రలో ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ రాబోతోంది.  Carl Zeiss opticsతో రియ‌ర్‌సైడ్‌లో 13 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ నోకియా 8కు పెద్ద ఎట్రాక్ష‌న్‌. ధ‌ర 35,999  
 

జన రంజకమైన వార్తలు