• తాజా వార్తలు
  •  

6జీబీ ర్యామ్ ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవీ..

ఫోన్‌లో ఎంత ర్యామ్ పెర్‌ఫార్మెన్స్ అంత బాగుంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మ‌ల్టీటాస్కింగ్‌కు ర్యామే ప్రాణం. మీ ఫోన్‌లో ర్యామ్ ఎంత ఎక్కువ‌గా ఉంటే అంత ఎక్కువ‌గా మీరు యాప్స్‌ను స్మూత్‌గా ర‌న్ చేయ‌గ‌లుగుతారు.  అందుకే మార్కెట్లో 6జీబీ ర్యామ్ ఫోన్లు కూడా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవీ..  
 
షియోమీ ఎంఐ మిక్స్ 2 
2016లోనే రిలీజ‌యిన  ఈఫోన్ రీసెంట్‌గా ఇండియ‌న్ మార్కెట్లోకి వ‌చ్చింది. 1,080 x 2,160 పిక్సెల్స్‌, 5.9 ఇంచెస్ బీజిల్‌లెస్ డిస్‌ప్లే చూడ‌గానే ఆకట్టుకుంటుంది.  స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌తో అల్టిమేట్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో ఎన్ని యాప్స్ అయినా వేసుకుని వాడుకోవ‌చ్చు. రియ‌ర్ 12 ఎంపీ కెమెరా విత్ 4 యాక్సిస్ ఆప్టిక‌ల్ ఇమేజ్‌,  ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 3,400 ఎంఏహెచ్ బ్యాట‌రీ మిగిలిన ఫీచ‌ర్స్‌. ప్రైస్‌: 32,990 
 
హాన‌ర్ 8 ప్రో 
హువావే స‌బ్‌బ్రాండ్ హాన‌ర్ నుంచి వ‌చ్చిన హాన‌ర్ 8 ప్రో కూడా 6జీబీ ర్యామ్ సెగ్మెంట్‌లో బెస్ట్ ఛాయిస్‌ల్లో ఒక‌టి.  ప్రీమియం మెట‌ల్ యూనిబాడీ, 1,440 x 2,560పిక్సెల్స్‌, 5.7 ఇంచెస్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది.  2.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ హై సిలికాన్ కైరిన్ 960 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌తో మ‌ల్టీ టాస్కింగ్ ఈజీగా చేయొచ్చు. రియ‌ర్ 12 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ఆర్‌జీబీ, మోనోక్రోమ్ సెన్స‌ర్ల‌తో వ‌చ్చింది. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది.   అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తుంది.   
ప్రైస్‌: 26,999 
 
హెచ్‌టీసీ యూ 11 
తైవాన్ బ్రాండ్ హాన‌ర్ హెచ్‌టీసీ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో వ‌చ్చిన ఫోన్ ఇది. 5.5 ఇంచెస్ 2కే డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 835  ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌తో పెర్‌ఫార్మెన్స్ బాగుంది. ఇక దీని ఎడ్జ్ సెన్స్ టెక్నాల‌జీ ( ఎడ్జ్‌ను స్క్వీజ్ చేసి కొన్ని టాస్క్‌లు కంప్లీట్ చేయ‌డం) ద్వారా యూజ‌ర్‌కు మ‌రింత ఫ్రెండ్లీగా ఉంటుంది.  దీని  12 ఎంపీ రియ‌ర్  కెమెరా డ్రోమార్క్‌లో 90 స్కోర్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ స్మార్ట్‌ఫోన్ కెమెరా కూడా ఇంత స్కోర్ రీచ్ కాలేదు.  కాబ‌ట్టి ఇమేజ్ క్వాలిటీలో డౌటే లేదు.    అయితే ధ‌ర కాస్త ఎక్కువే.
ప్రైస్‌: 51,990 
 
వ‌న్‌ప్ల‌స్ 5 
త‌క్కువ ధ‌ర‌లోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవ్వ‌డంలో పేరుతెచ్చుకున్న వ‌న్‌ప్ల‌స్ 5 కూడా 6జీబీ ర్యామ్‌తో వ‌చ్చింది. లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌తో మ‌ల్టీ టాస్కింగ్‌ను ఓ ఆటాడేసుకోవ‌చ్చు.   చూడ్డానికి ఐఫోన్ 7 ప్ల‌స్‌లా స్లీకీగా కనిపిస్తుంది.  16, 20 ఎంపీ లెన్స్‌ల‌తో డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరాలున్నాయి.  2ఎక్స్ లాస్‌లెస్ జూమ్‌, పోట్రెయిడ్ మోడ్ దీనిలో స్పెష‌ల్. వ‌న్‌ప్ల‌స్ నుంచి వ‌చ్చిన తొలి డ్యూయల్ కెమెరా ఫోన్ ఇదే.  ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ వేరియంట్ కూడా ఉంది. 
ప్రైస్‌: 32,999
 
శాంసంగ్ గెలాక్సీనోట్ 8 
గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్‌తో గ‌ట్టి దెబ్బ తిన్న శాంసంగ్ రెట్టించిన క‌సితో ఈ నోట్‌8ను మార్కెట్లోకి తెచ్చింది. గ్లాస్ బాడీ, 6.3 ఇంచెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేతో వ‌చ్చిన నోట్ 8 ఈజీగా ఎట్రాక్ట్ చేస్తుంది.  6జీబీ ర్యామ్‌, ఎక్సినోస్ 8895 ప్రాసెస‌ర్‌తో పెర్‌ఫార్మెన్స్ సూప‌ర్ అనే చెప్పాలి. 12 ఎంపీ రియ‌ర్ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ మంచి ఫోటోల‌నిస్తుంద‌. ఈ ఫోన్‌తో వ‌చ్చే స్టైల‌స్ పెన్ మోడ‌ల్ వాడడం ఇష్టం లేక‌పోతే 6జీబీ ర్యామ్ వేరియంట్‌తో వ‌చ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ మంచి ఆల్ట‌ర్నేట్‌.
ప్రైస్‌: 67,900
 
కూల్‌ప్యాడ్ కూల్ ప్ల 6  
6జీబీ ర్యామ్ ఫోన్లలో అతి త‌క్కువ ధ‌ర ఫోన్ ఇది. ధ‌ర త‌క్కువ‌గా ఉంద‌ని పెర్‌ఫార్మెన్స్ విష‌యంలో చిన్న‌చూపు అక్క‌ర్లేద‌ని, పెద్ద బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు మంచి కాంపిటీట‌ర్ అని కంపెనీ చెబుతోంది.5.5 ఇంచెస్  ఫుల్ హెచ్‌డీ   డిస్‌ప్లేతో వ‌చ్చింది.  6జీబీ ర్యామ్‌, స్నాప్‌డ్రాగ‌న్  653 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది.  శాంసంగ్ ఫోన్ల‌లోనే తొలిసారిగా16 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని స్పెషాలిటీ.  ఆండ్రాయిడ్ 7.1.1 నూగ‌ట్ బేస్డ్ యూఐ ఓఎస్‌తో ప‌ని చేసే  ఈఫోన్‌లో 4,600 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది.
ప్రైస్‌: 14,999
 
శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రో   
వ‌న్‌ప్ల‌స్‌, షియోమీల నుంచి 6జీబీ ర్యామ్ ఫోన్ల బిజినెస్‌లో ఎదుర‌వుతున్న కాంపిటీష‌న్‌ను త‌ట్టుకునేందుకు శాంసంగ్ తీసుకొచ్చిన మోడ‌ల్ ఇది.  6  సూప‌ర్ అమౌల్డ్ ఫుల్ హెచ్‌డీ   డిస్‌ప్లేతో వ‌చ్చిన ఈ ఫ్యాబ్లెట్  6జీబీ ర్యామ్‌, స్నాప్‌డ్రాగ‌న్  653 ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది.  శాంసంగ్ ఫోన్ల‌లోనే తొలిసారిగా16 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని స్పెషాలిటీ.  4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది.
ప్రైస్‌: 29,900

జన రంజకమైన వార్తలు