• తాజా వార్తలు

వాట‌ర్‌ఫ్రూప్ స్మార్ట్‌ఫోన్ల‌లో టాప్‌ ఫోన్లు మీ కోసం

స్మార్ట్‌ఫోన్ల‌తో మ‌న‌కున్న పెద్ద ఇబ్బంది ఏంటంటే నీళ్ల‌లో ప‌డ‌డం! నీళ్ల‌లో ప‌డిపోతే ఇక స్మార్ట్‌ఫోన్ ప‌ని గోవిందే! ఆండ్రాయిడ్ ఫోన్లు నీళ్ల‌లో ప‌డిపోయిన త‌ర్వాత ప‌ని చేసిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. వాటిని హుటాహుటిన క‌స్ట‌మ‌ర్ కేర్ సెంట‌ర్‌కు తీసుకెళ్లినా.. ఆ సాఫ్ట్‌వేర్ పోయింది.. ఈ సాఫ్ట్‌వేర్ పోయింద‌ని చెప్పి భారీగా డ‌బ్బులు అడుగుతారు. దాని క‌న్నా మ‌ళ్లీ కొత్త ఫోన్ కొనుక్కోవ‌డ‌మే బెట‌ర్ అన్న‌ట్టు ఉంటాయి వాళ్లు చెప్పే ధ‌ర‌లు.  ఈ నేప‌థ్యంలో ఫోన్లు నీళ్లలో ప‌డినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని వాట‌ర్‌ఫ్రూఫ్ ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అవేంటో చూద్దాం..

యాపిల్ ఐఫోన్ 7
గ‌తంలో  యాపిల్ వాట‌ర్ రెసిస్టెంట్ కాదు అయితే కొన్ని అనుభ‌వాల దృష్ట్యా ఆ కంపెనీ వాట‌ర్ రెసిస్టెన్స్‌పై దృష్టి పెట్టింది. గ‌తేడాది విడుద‌ల చేసిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్ల‌స్‌లు వాట‌ర్ ఫ్రూఫ్‌గా త‌యార‌య్యాయి. వీటికి చ‌రిత్ర‌లో తొలిసారి ఐపీ67 రేటింగ్ వ‌చ్చింది. దీనిలో వాడిన డ‌స్ట్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ వ‌ల్ల 30 నిమిషాల వ‌ర‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. 1 ఎం లోతు వ‌ర‌కు వాట‌ర్ దిగినా ఏం కాదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్‌
ఐఫోన్ మాదిరిగానే శాంసంగ్ కూడా వాట‌ర్ రెసిస్టెన్స్ ఫోన్ల‌ను మార్కెట్లోకి దింపింది. 2014లోనే ఈ కంపెనీ వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ టెక్నాల‌జీతో ఫోన్ల‌ను త‌యారు చేసింది. అయితే గెలాక్సీ ఎస్‌6, ఎస్‌6 ఎడ్జ్ మోడ‌ల్స్‌లో ఈ ఆప్ష‌న్ లేదు. అయితే గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ ఫోన్ల‌ను ఈ కంపెనీ వాట‌ర్ రెసెస్టింట్‌గా రూపొందించింది. మెటల్ అండ్ గ్లాస్‌ను మేళ‌విస్తూ శాండ్‌విచ్ డిజైన్‌తో దీన్ని త‌యారు చేశారు

ఎల్‌జీ జీ6
వాట‌ర్ రెసిస్టెన్స్ ఫోన్ల‌ను త‌యారు చేయ‌డంలో ఎల్‌జీ ముందంజ‌లో ఉంటుంది. ఎల్‌జీ జీ6లో ఈ వాట‌ర్ రెసిస్టెన్స్ ప్ర‌త్యేకంగా ఉంది. వాట‌ర్ మాత్ర‌మే కాదు ఇది డ‌స్ట్ రెసిస్ట‌ర్ కూడా. అండ‌ర్ వాట‌ర్ ఫొటోగ్ర‌ఫీ కోసం ఈ ఫోన్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాదాపు 30 నిమిషాలు వాట‌ర్ లోప‌ల ఉంచి మ‌నం ఫొటోలు తీయ‌చ్చు. 1 మీట‌ర్ డెప్త్ వ‌ర‌కు వెళ్లొచ్చు.

హెచ్‌టీయూ యూ11
వాట‌ర్ రెసిస్టెన్స్ శ్రేణిలో వ‌చ్చిన మ‌రో ఫోన్ హెచ్‌టీయూ యూ11. ఐపీ 67 రేటింగ్ ఉన్న ఈ ఫోన్‌ను కూడా మంచి వాట‌ర్ రెసిస్టెంట్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి స్క్వీజ‌బుల్ స్మార్ట్‌ఫోన్‌. హ్యాండ్ సెట్‌ను స్క్వీజ్ చేస్తూ మీరు కొన్ని టాస్క్‌లు పూర్తి చేయ‌చ్చు. డ‌స్ట్ రెసిస్ట‌ర్ కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియం
వాట‌ర్ రెసిస్ట‌ర్‌, డ‌స్ట్ రెసిస్ట‌ర్‌గా సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ప్రీమియం మోడ‌ల్ పేరొందింది. వాట‌ర్‌లో ప‌డినా 30 నిమిషాల వ‌ర‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప‌ని చేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. డ‌స్ట్ ప‌డినా ఆటోక్లిన‌ర్‌తో ఇది క్లీన్ చేసుకుంటుంది.