• తాజా వార్తలు
  •  

ఎక్కువ హ‌డావుడి చేయని ఈ వాల్యూ ఫ‌ర్ మ‌నీ ఫోన్లు మీకు తెలుసా? 

ఇండియా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ త‌యారీదార్ల‌కు పెద్ద మార్కెట్‌.  చైనీస్ కంపెనీలు షియోమి, వొప్పో, వివో, లెనోవో,  తైవాన్ కంపెనీ హెచ్‌టీసీ, కొరియ‌న్ జెయింట్  శాంసంగ్ ఇలా ఏ కంపెనీ అయినా కొత్త ఫోన్ రిలీజ్ చేయాలంటే ఇండియ‌న్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోవాల్సిందే.  అయితే ఇలా ఎన్నో స్పెక్యులేష‌న్స్‌తో మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన ఫోన్లు చాలావ‌ర‌కు స‌క్సెస్ కావు. అయితే అందులోనూ వాల్యూ ఫ‌ర్ మ‌నీ ఇచ్చే ఫోన్లు చాలా ఉంటాయి. అలాంటి కొన్ని ఫోన్ల వివ‌రాలు చూడండి.

1. మోటో జెడ్ 2 ప్లే: ఇది నెక్స్ట్ జ‌న‌రేష‌న్ మాడ్యుల‌ర్ స్మార్ట్‌ఫోన్‌.  ఫుల్ మెట‌ల్ బాడీ, 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూప‌ర్ అమౌల్డ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 626 ప్రాసెస‌ర్‌,  4జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నూగ‌ట్ ఓఎస్‌తో ప‌ని చేస్తుంది. ప్రైస్‌: 27,999
2.హాన‌ర్ 8 ప్రో: 5.7 ఇంచెస్ క్యూహెచ్‌డీ 2కే డిస్‌ప్లే, 1440x2560 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో సూప‌ర్ స్క్రీన్ దీని సొంతం. కైరిన్ 960 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌తో అల్ట్రా స్పీడ్‌గా ప‌ని చేస్తంఉది. 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 12 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్‌, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ దీని స్పెషాలిటీస్. ప్రైస్‌: 29,999
3. ఐఫోన్ 8, 8 ప్ల‌స్ : సెప్టెంబ‌ర్‌లో ఇండియాలో లాంచ్ అయిన ఐఫోన్ 8 4.7 ఇంచెస్ రెటీనా హెచ్‌డీ స్క్రీన్‌తో, ఐఫోన్ 8 ప్ల‌స్ 5.5 ఇంచెస్ స్క్రీన్‌తో వ‌చ్చాయి.  ఐవోస్‌11 ఓఎస్‌తో  ఏ11 బ‌యోనిక్ చిప్‌సెట్‌తో సూప‌ర్ ఫాస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. ఐఫోన్ 8లో 12 ఎంపీ రియ‌ర్ కెమెరా ఉంటే ఐఫోన్ 8 ప్ల‌స్‌లో 12 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్ ఉంది. 64, 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. ప్రైస్‌: 64వేల నుంచి ప్రారంభం
4. హెచ్‌టీసీ యూ11:  ఫ‌స్ట్ squeezable bezel స్మార్ట్‌ఫోన్.  దీనికి సైడ్ బీజిల్స్‌లో 8 సెన్స‌ర్లంటాయి.  ఇవి ఎడ్జ్ సెన్స్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అందుకే వీటిని లాంగ్ ప్రెస్ చేస్తే ఏ యాప్‌నైనా లాంచ్ చేసి యూజ్ చేసుకోవ‌చ్చు. ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్ , లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఓఎస్‌తో ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ ఫెర్‌ఫార్మెన్స్ ఖాయం.  128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌ను ఎస్డీ కార్డ్‌తో ఏకంగా 2 టీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు. ప్రైస్: 51,990
5. ఎల్జీ జీ6:  ఎల్జీ నుంచి ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  5.7 ఇంచెస్ ఫుల్ విజ‌న్ డిస్‌ప్లే, 1440x2880 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో డెప్త్ పిక్చ‌ర్ క్వాలిటీని ఇస్తుంది. క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాన్ 821 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌. 12 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ దీని ప్ర‌త్యేత‌క‌లు. 51,990 రూపాయ‌ల ధ‌ర‌ల‌తో లాంచ్ అయిన  ఈ ఫోన్ కొన్ని నెల‌ల్లోనే బాగా తగ్గి 36,990 రూపాయ‌ల‌కు ల‌భిస్తోంది. 
6. హెచ్‌టీసీ యూ ఆల్ట్రా:  ఎల్జీ వీ20 మాదిరిగానే ఇది కూడా డ్యూయ‌ల్ డిస్‌ప్లేతో వ‌చ్చింది. ఫ్రంట్ 5.7 ఇంచెస్ క్యూ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు దానిపైన మ‌రో 2 ఇంచెస్ డిస్‌ప్లే దీని స్పెషాలిటీ.  ఆండ్రాయి్ 7.0 నూగ‌ట్ ఓఎస్‌తో డిచే  ఈఫోన్‌లో 4జీబీ ర్యామ్‌, స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్ ఉన్నాయి.  12 ఎంపీ రియ‌ర్ కెమెరా సూప‌ర్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చింది.  ఫ్రంట్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా మ‌రో ఎట్రాక్ష‌న్ ప్రూస్‌: 29,990  

  

జన రంజకమైన వార్తలు