• తాజా వార్తలు
  •  

ఐ ఫోన్ ప‌దో యానివ‌ర్స‌రీ ఎడిష‌న్‌.. ఐ టెన్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లు ఇవీ.. 

ఐ ఫోన్‌.. ఎల‌క్ట్రానిక్స్ ప్ర‌పంచంలో ఓ అద్భుత ఆవిష్క‌ర‌ణ‌. ఈ ఫోన్ కొత్త మోడ‌ల్ రిలీజ‌వుతుందంటే ప్రపంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది ఐ ఫోన్ ఫ్యాన్స్ క‌ళ్ల‌ప్ప‌గించి ఎదురుచూస్తారు. కొన్ని దేశాల్లో ఐఫోన్ కొత్త మోడ‌ల్ సేల్స్ రేపు మొద‌ల‌వుతాయంటే ఈ రోజు రాత్రి నుంచే స్టోర్స్ ముందు బారులు తీర‌తారు. అంతెందుకు ప్ర‌పంచంలోనే గొప్ప ఎల‌క్ట్రానిక్స్ కంపెనీగా పేరొందిన యాపిల్‌కు ఇప్పుడు ఐ ఫోన్ ఒక్క‌టే పెద్ద రెవెన్యూ తెస్తోంది. అలాంటి ఐ ఫోన్ తొలిసారిగా మార్కెట్లోకి రిలీజై ప‌దేళ్లు దాటింది. ఈ సంద‌ర్భాన్ని పురస్క‌రించుకుని ప్ర‌త్యేక ఎడిష‌న్‌గా ఐఫోన్ టెన్‌ను యాపిల్ మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈవెంట్లో  ఆవిష్కరించింది.  టెన్త్ యానివ‌ర్స‌రీ ఎడిష‌న్ గా తెచ్చిన ఈ ఫోన్‌లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. 
బిగ్‌స్క్రీన్‌..  బీజిల్‌లెస్ డిస్‌ప్లే
ఐఫోన్ టెన్‌లో5.8 ఇంచెస్ స్క్రీన్ ఇచ్చారు. ఇది ఐఫోన్‌లో వ‌చ్చిన అతి పెద్ద స్క్రీన్‌.   OLED  తో సూప‌ర్ రెటీనా స్క్రీన్ డిస్‌ప్లే దీని సొంతం.  ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే తో చాలా భారీగా క‌నిపిస్తుంది.  2436 x 1125 పిక్సెల్స్ డెప్త్‌తో  Quad HD+ picture ను ఇస్తుంది. 
ఛార్జింగ్‌కు మ‌ల్టిపుల్ ఆప్ష‌న్స్  
 వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్ ఉంది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న క్యూఐ ఛార్జ‌ర్స్‌తో చార్జ్ చేసుకోవ‌చ్చు. దీంతోపాటు కొత్త‌గా తీసుకొచ్చిన‌ AirPower charging padతో కూడా ఐఫోన్ టెన్‌ను ఛార్జి చేసుకోవ‌చ్చు. 
కంటిచూపుతో అన్‌లాక్ చేసుకోవ‌చ్చు
ఐఫోన్‌ టెన్‌ను  యూజ‌ర్  తన ముఖానికి ఎదురుగా ఉంచుకుని, కళ్లతో చూస్తే చాలు  అన్‌లాక్‌ అవుతుంది.  ఫ్రంట్ కెమెరాలో ఉంటే మ‌ల్టిపుల్ సెన్స‌ర్లు మీ ఫేస్ ను రిక‌గ్నైజ్ చేసి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తాయి.  ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్ కంటే ఇది మ‌రింత సెక్యూర్డ్ అని యాపిల్ చెబుతోంది.  శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ ఫీచ‌ర్‌ను మాస్క్‌ల‌తో హ్యాక్ చేసిన విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని యాపిల్ ఈ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుంది.  ఫేస్ ఐడీతో అన్‌లాక్ చేసే సంద‌ర్బాల్లో ల‌క్ష‌లో ఒక్క‌సారి మాత్ర‌మే ఫెయిల్ అవుతుంద‌ని యాపిల్ చెబుతోంది.  

కెమెరా
సెల్ఫీల కోసం ఉన్న 7 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పోట్రెయిట్ మోడ్ సెల్ఫీస్ కూడా తీసుకోవ‌చ్చు. కాబ‌ట్టి  క‌ల‌ర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌కు కూడా మీ సెల్ఫీలో చోటు దొరికిన‌ట్లే. దీనిలో ఫేస్  ఐడీకి సంబంధించి ఫేస్ మ్యాపింగ్ డాట్ ప్రొజెక్ట‌ర్ కూడా ఉంది.

మ‌రిన్ని సూప‌ర్ స్పెసిషికేష‌న్స్ 
* 3డీ ట‌చ్‌తో ట‌చ్ స్క్రీన్ కంట్రోల్స్ మ‌రింత స్మూత్‌గా, ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి. 
* హెక్సా కోర్ ప్రాసెస‌ర్‌తో ఫోన్ స్పీడ్ పెరుగుతుంది. 3డీ గేమ్స్‌, ఏఆర్ యూసేజ్ కూడా ఎలాంటి లాగ్స్ లేకుండా చేసుకోవ‌చ్చు. 
* వాట‌ర్ రెసిస్టెంట్ ఫోన్ 
 *   3డీ స్కానర్‌ సాయంతో మీ ముఖాకృతితో అనిమొజి  (ఎమోజీ + యానిమేష‌న్‌) రూపొందించుకోవ‌చ్చు.  
ప్రైస్‌
64 జీబీ నుంచి ప్రారంభమయ్యే ఐఫోన్‌ టెన్‌ ధర 999 డాలర్లు. 256 జీబీ వరకు మోడళ్లు ఉన్నాయి.  ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా 
రివీల్ చేయ‌లేదు. 
 

జన రంజకమైన వార్తలు