• తాజా వార్తలు
  •  

ప్రివ్యూ - ప్ర‌పంచ‌పు అతి చిన్న మొబైల్ ఫోన్ టినీ టీ1

5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌.. నో వే. . క‌నీసం 6 ఇంచెస్ స్ర్కీన్ ఉండాలి. అది సూప‌ర్ అమౌల్డ్ హెచ్‌డీ డిస్‌ప్లే బాగుంటుంది. బీజిల్ లెస్ డిస్‌ప్లే ఇంకా బెట‌ర్‌.  ఇదీ స్మార్ట్‌ఫోన్ల ట్రెండ్‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచంలో అతి చిన్న ఫోన్‌ను త‌యారు చేశారు. ఈ ఫోన్‌లో స్క్రీన్ సైజ్ 0.49 ఇంచెస్ మాత్ర‌మే.  వేళ్ల మ‌ధ్య‌లో ఇమిడే ఈ ఫోన్‌ను ఎక్క‌డికైనా ఈజీగా ప‌ట్టుకుపోవ‌చ్చు. 
రెండేళ్ల రీసెర్చ్‌
అతి చిన్న ఫోన్లు త‌యారు చేయ‌డంలో స్పెష‌లిస్ట్ అయిన షాజాద్ తాలిబ్ లేటెస్ట్ ఆవిష్క‌ర‌ణ ఈ ఫోన్‌.  రెండేళ్ల పాటు క‌ష్ట‌ప‌డి తయారుచేసిన ఈ బుడ్డి ఫోన్‌ పేరు టినీ టీ 1.   46.7 మి.మీ పొడ‌వు.  21 మి.మీ వెడ‌ల్పు, 12 మి.మీ. మందంలో ఉంటుంది. ప్ర‌స్తుతానికి ప్రోటోటైప్ మాత్ర‌మే రిలీజ్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్‌గా త‌యారుచేసి మాస్ ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేస్తారు. 2018 మే నుంచి షిప్పింగ్ ప్రారంభిస్తారు. 
 Tiny T1 ఫోన్లో స్పెసిఫికేష‌న్స్ ఇవీ.. 
బ‌రువు: 13 గ్రాములు
స్క్రీన్ :  64x32  రిజ‌ల్యూష‌న్‌తో  0.49 ఇంచెస్ ఓఎల్ఈడీ స్క్రీన్  
ఫోన్ బుక్‌: 300 కాంటాక్ట్స్ 
50 ఎస్ఎంస్‌లు స్టోర్ చేసుకోవ‌చ్చు. మైక్రో యూఎస్‌బీతో క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.  2జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌ని చేస్తుంది. 
ప్రైస్‌: 40 డాల‌ర్లు (2,500 రూపాయ‌లు) 

 

జన రంజకమైన వార్తలు