• తాజా వార్తలు
  •  

ఎంఐ మొబైల్‌ ఎక్స్చేంజ్  షురూ.. కానీ ముందు ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి 

షియోమి చైనా మొబైల్ కంపెనీ అయినా  అది రిలీజ్ చేసే ప్ర‌తి ఫోన్‌కూ ఇండియాలో సూప‌ర్ రెస్పాన్స్‌. అందుకే శాంసంగ్‌తో పాటు ఇండియాలో టాప్ సెల్లింగ్ మొబైల్ ఫోన్‌గా నిలిచింది.  షియోమి ఇప్పుడు కొత్త‌గా  ఎంఐ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఆ విశేషాలేంటో చూద్దాం ప‌దండి. 
ఎలా ప‌ని చేస్తుంది? 
     షియోమి.. క్యాషిఫై అనే మ‌రో కంపెనీతో క‌లిసి ఈ  ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసింది.  దీని కింద యూజ‌ర్లు త‌మ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎంఐ స్టోర్‌కు తీసుకెళితే క్యాషిఫై టీమ్ మీ ఫోన్‌కు వాల్యూ నిర్ణ‌యిస్తుంది. మిగిలిన అమౌంట్ ఇచ్చి మీరు షియోమి నుంచి న‌చ్చిన కొత్త ఫోన్ కొనుక్కోవ‌చ్చు. అంతేకాదు క‌స్ట‌మ‌ర్లు ఎంఐ స్టోర్‌లో కొత్త షియోమి ఫోన్ కొనుక్కుని, త‌మ పాత ఫోన్ ఇవ్వ‌డానికి ఇంటికి ర‌మ్మ‌ని కూడా కాల్ చేయొచ్చు. క్యాషిఫై టీమ్ మీ ఇంటికి వ‌చ్చి మీఫోన్‌కు రీసేల్ వాల్యూ నిర్ణ‌యిస్తుంది. ఆ అమౌంట్‌ను ఇంటి ద‌గ్గ‌రే  మీకు ఇచ్చేస్తారు. క‌స్ట‌మ‌ర్లు ఒక ఫోన్ కొంటే ఒక్క పాత ఫోన్ మాత్ర‌మే ఎక్స్చేంజ్‌లో తీసుకుంటారు.   
ఎక్క‌డ ఎక్స్చేంజ్ చేసుకోవాలి?
ఎంఐ హోం  స్టోర్స్‌లో మాత్రమే ఈ   ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది.  ఇండియాలో ఢిల్లీ, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, పుణె, ముంబ‌యి, చెన్నై సిటీస్‌లో 11 ఎంఐ హోం స్టోర్లు ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు