• తాజా వార్తలు
  •  

2017 లో అట్టర్ ఫ్లాప్ అయిన 7 ఫోన్ లు .... కారణాలేంటి?

2017 వ సంవత్సరం లో అనేక రకాల కొత్త ఫీచర్ ల తో కూడిన స్మార్ట్ ఫోన్ లు లాంచ్ చేయబడ్డాయి. డిస్ప్లే, కెమెరా మరియు అనేక ఇతర ఫీచర్ లతో విభిన్నంగా తీసుకురాబడ్డ అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు ఈ సంవత్సరం తమ విశిష్టత ను చాటుకొని వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్నాయి. అయితే వీటిలో కొన్ని మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోగా వాటిపై అంచనా పెట్టుకున్న వారిని నిరుత్సాహపరచాయి. అలాంటి ఫోన్ లలో 7 ఫోన్ ల గురించీ, అసలు అవి అంతగా ఫ్లాప్ అవడానికి గల కారణాల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

సోనీ ఎక్స్ పీరియా XA1 అల్ట్రా                  

సోనీ తన ఎక్స్ పీరియా సిరీస్ కొన్ని రకాల స్మార్ట్ ఫోన్ లను ఈ సంవత్సరం లాంచ్ చేసింది. వీటిలో కొన్ని ఫోన్ లు అంతగా క్లిక్ కాలేక పోయాయి. వాటిలో  సోనీ ఎక్స్ పీరియా XA1 అల్ట్రా ప్రముఖంగా నిలుస్తుంది. దీని ధర ఎక్కువగా ఉండడం మాత్రమే గాక మామూలు రూ 10,000/- ల ధర లో లభించే అనేక ఫోన్ లలో ఉండే బేసిక్ ఫీచర్ లు కూడా ఇందులో లేకపోవడం దీని ప్రధాన ప్రతికూలత. మంచి కెమెరా ను కలిగి ఉన్నప్పటికీ యావరేజ్ సెన్సార్ ను కలిగి ఉండడం , ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోవడం అనేవి దీని మైనస్ లుగా చెప్పుకోవచ్చు.

బ్లాక్ బెర్రీ కీ వన్

ఎలాగోలా ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తన షేర్ పెంచుకోవాలి అని ఆశ పడ్డ బ్లాక్ బెర్రీ కి ఈ సంవత్సరం నిరాశే మిగిలింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టం కాకుండా ఆండ్రాయిడ్ ను ఎంచుకున్నప్పటికీ తగిన ఫలితం రాలేదు. ఈ సంవత్సరం ఇది బ్లాక్ బెర్రీ కీ వన్ అనే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే ఇది మామూలు స్థాయి స్పెసిఫికేషన్ ల ను కలిగి ఉండడమే కాకుండా రూ 39,999/- ల అధిక ధర ను కలిగి ఉండడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. దీనిలో సెక్యూరిటీ ఫీచర్ లు చాలా బాగా ఉన్నప్పటికీ హార్డ్ వేర్ డిపార్టుమెంటు చాలా తక్కువ స్థాయి లో ఉంది.

షియోమీ Mi Mix 2              

బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ ల విషయానికొస్తే ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో షియోమీ ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అయితే ప్రీమియం ధర లో ఉండే ఫోన్ ల విషయం లో మాత్రం ఆ స్థాయిని అందుకోలేక పోతోంది. ఇది ఈ సంవత్సరం మొట్టమొదటి బెజెల్ లెస్ స్మార్ట్ ఫోన్ షియోమీ Mi Mix 2 ను లాంచ్ చేసింది. మొదట్లో దీని ధర రూ 35,999/- లు ఉండగా ఆ తర్వాత రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ప్రకటించినప్పటికీ ఏ మాత్రం ఆదరణ పెరగలేదు. ఇది గత సంవత్సరం లాంచ్ చేసిన Mi5 విషయం లోనూ ఇలాగే జరిగింది. కాబట్టి ప్రీమియం ఫోన్ ల విభాగం లో ఇది మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఆసుస్ జెన్ ఫోన్ AR

ప్రపంచం లొనెవ్ మొట్టమొదటిసారిగా AR మరియు VR సపోర్ట్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. ఇందులో ఉన్నత స్థాయి ఫీచర్ లు మరియు స్పెసిఫికేషన్లు ఉన్నప్పటికీ వినియోగదారులను మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇండియా లో AR మరియు VR అనేది హాట్ ట్రెండ్ కాక పోవడం తో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కనీసం ఆసక్తిని కూడా రేకెత్తించలేకపోయింది.

LG G6        

LG యొక్క మాడ్యులర్ స్మార్ట్ ఫోన్ అయిన G5 విఫలం చెందడం తో ఇది చాలా జాగ్రత్త గా ఇది LG G6 ను లాంచ్ చేసింది. ఇది మొట్టమొదటి సారిగా ఫుల్ విజన్ డిస్ప్లే తో ఈ ఫోన్ ను విడుదల చేసింది.దీనితో పాటు ఇది కొన్ని ఉన్నత స్థాయి స్పెసిఫికేషన్ లను కూడా అందిస్తుంది. అయితే ఇది కూడా తన ముందు వెర్షన్ లాగే వినియోగదారులను ఆకట్టుకోవడం లో విఫలం అయింది. ఆ తర్వాత కొంత ధర తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

వివో V7+

వివో ఈ సంవత్సరం తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ అయిన వివో V7+ ను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన వెంటనే ఇది కొన్ని ప్రతికూలత లను ఎదుర్కోవాల్సి వచ్చింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ తో పవర్ చేయబడిన ఈ ఫోన్ 24 MP సెల్ఫీ కెమెరా ను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇంత ఎక్కువ పిక్సెల్ కౌంట్ తో ఉన్న కెమెరా ను అందించే సామర్థ్యం క్వాల్ కాం లేదని తెలియడం తో దీనిపై విమర్శలు మొదలయ్యాయి. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంప్రూవ్ మెంట్ చేసామని కంపెనీ ప్రకటించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

HTC U Ultra

ఈ సంవత్సరం ప్రారంభం లో HTC తన U play డిస్ప్లే ను కలిగిఉన్న HTC U Ultra ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే ఇది రూ 52,999/- ల అధిక ధర లో ఉండడం అంతకుమించి ఏమీ ఎక్కువ ఆఫర్ చేయకపోవడం వలన ఇది విఫలం చెందింది. అయితే ఆశ్చర్యకరంగా ఇది ర్పప్ 22,991/- భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించింది. మరి ఇప్పుడైనా దీని కొనుగోళ్ళు పెరుగుతాయేమో చూడాలి.

 

 

జన రంజకమైన వార్తలు