• తాజా వార్తలు
  •  

4జిబి ర్యామ్‌తో honor 7x,ధర రూ. 12,999 మాత్రమే !

హువాయి సబ్ బ్రాండ్ హానర్ తన తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 7ఎక్స్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. హానర్ 6ఎక్స్ విజయవంతమైన నేపథ్యంలో దానికి సరికొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లోకి వదిలింది. రెండు వేరియంట్లలో లభ్యం కానున్న ఈ ఫోన్ 32జీబీ వేరియంట్‌ ధరను రూ.12,999గా, 64జీబీ వేరియంట్‌ ధరను రూ. 15,999గా కంపెనీ నిర్ణయించింది.

18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన ఫుల్ వ్యూ డిస్‌ప్లే , డ్యూయల్‌ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లు. Blue, Gold, and Black రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

హానర్ 7ఎక్స్ ఫీచర్లు :

5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే,

2.5డి కర్వ్‌డ్ గ్లాస్,ఆక్టాకోర్ ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్,

2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్,

4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం

16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

3340 ఎంఏహెచ్ బ్యాటరీ

జన రంజకమైన వార్తలు