• తాజా వార్తలు

    3 గంటలు ఛార్జింగ్ చేస్తే 4 రోజులు ఆగకుండా పనిచేసే స్మార్టు ఫోన్

    
    జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు షార్ప్ సంస్థ 'ఎక్స్1' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.40,500 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. 
    కాగా షార్ప్ నుంచి వచ్చిన రెండో ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. గత ఏడాది ఆక్వాస్ 507 ఎస్ హెచ్ పేరుతో ఓ మోడల్ రిలీజ్ చేసింది. ఆ తరువాత మళ్లీ ఇదే. అయితే... ఇతర  ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పోల్చితే షార్ప్‌   ఎక్స్‌1  ధర ఎక్కువని ఇండస్ర్టీ వర్గాల టాక్. ముఖ్యంగా స్పెసిఫికేషన్లు మిడ్ రేంజిలోనే ఉండడంతో ధర ఎక్కువన్న భావన వ్యక్తమవుతోంది. 
    షార్ప్ చెబుతున్న వివరాలు చూస్తుంటే ఇందులో బ్యాటరీ ఒక్కటే కాస్త స్పెషల్ అని తెలుస్తోంది. ఎందుకంటే మూడు గంటల్లో ఫుల్ చార్జింగ్ అయ్యే ఈ బ్యాటరీ నాలుగు రోజుల పాటు పనిచేస్తుందట. 

ఇవీ స్పెసిఫికేషన్లు
* 5.3-అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ  డిస్‌ ప్లే
* 1080x1920 పిక్సల్స్  రిజల్యూషన్‌
* ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌
* క్వాల్ కామ్ స్నాప్డ్రాగెన్ 435
* 3జీబీ ర్యామ్‌
* 32 జీబీ ఇంటర్నల్‌ మొమరీ   
* 16.4-మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* 3900 ఎంఏహెచ్‌  బ్యాటరీ సామర్ధ్యం