• తాజా వార్తలు
  •  

ఈ మ‌ధ్య ఎక్కువ ప్రైస్ క‌ట్ అయిన స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీ కోసం..

ఇండియ‌న్ మార్కెట్ ఇప్పుడు సెల్‌ఫోన్ త‌యారీ కంపెనీల‌కు క‌ల్ప‌వృక్షం. ప్ర‌తి రోజూ కొత్త మోడ‌ల్స్‌తో కంపెనీలు మార్కెట్‌లో సంద‌డి చేస్తున్నాయి. దాంతోపాటే ఇప్ప‌టికే ఉన్న మోడ‌ల్స్‌పై భారీగా త‌గ్గింపు ధ‌ర‌లు ప్ర‌క‌టిస్తున్నాయి. రీసెంట్ గా 19 స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గితే అందులో 8 శాంసంగ్ ఫోన్లే.  రీసెంట్‌గా ప్రైస్ క‌ట్ అయిన స్మార్ట్‌ఫోన్ల వివ‌రాలివీ..
ఐఫోన్ 7,  7 ప్ల‌స్‌
ఐఫోన్ 8, 8ప్ల‌స్‌, టెన్ మార్కెట్‌లోకి రావ‌డంతో ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న 7 ప్ల‌స్‌, 7 ల‌పై యాపిల్ ధ‌ర‌లు త‌గ్గించింది. 5.7 ఇంచెస్ రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే, 12 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్ కెమెరా సెట‌ప్‌, 7 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్న ఐఫోన్ 7 ప్ల‌స్ ప్రైస్ క‌ట్ త‌ర్వాత 59వేల రూపాయ‌ల‌కు ల‌భిస్తోంది.
* ఇప్ప‌టివ‌ర‌కు 68వేల రూపాయ‌ల ధ‌ర ఉన్న ఐఫోన్ 7పై 8,2000 రూపాయల ధ‌ర త‌గ్గించారు. 
* 56,100 రూపాయల  ధరతో  రిలీజయిన  ఐఫోన్ 6 ఎస్ ఇప్పుడు 40వేల నుంచి అందుబాటులో ఉంది.  
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8+
శాంసంగ్ త‌న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు  గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8+ల‌పైనా ధ‌రత‌గ్గించింది.  గెలాక్సీ ఎస్‌8 ధర 4వేలు త‌గ్గింది. ప్ర‌స్తుతం 53,900కు దొరుకుతుంది.  ఎస్‌8+ 6వేలు ధ‌ర త‌గ్గి 58,900కు ల‌భ్య‌మ‌వుతోంది.  
* వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెంట్ ఫీచ‌ర్లు, 5.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వ‌చ్చిన శాంసంగ గెలాక్సీ ఏ7 మోడ‌ల్‌పై 10వేల ధ‌ర త‌గ్గించి 20,990 రూపాయ‌ల‌కు మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చారు. 
* శాంసంగ్ గెలాక్సీ ఏ5 మీద 10వేలు తగ్గించారు. 17, 990 రూపాయలకు అందుబాటులో ఉంది. 
*  శాంసంగ్ జే5 ప్రైమ్‌పై 1800 రూపాయ‌ల తగ్గింపు ఇచ్చారు. ఇప్పుడు 12,990 రూపాయ‌ల‌కు ల‌భిస్తోంది.
*  శాంసంగ్ జే7 ప్రైమ్‌పైనా 1800 రూపాయ‌ల తగ్గింపు ఇచ్చారు. ఇప్పుడు 16,990 రూపాయ‌ల‌కు దొరుకుతోంది. 
*  శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రో మీద 7వేల రూపాయల ధర తగ్గించారు. 36,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో వచ్చిన  ఈ ఫోన్ ఇప్పుడు 29,990 రూపాయ‌లు.  
*  శాంసంగ్ గెలాక్సీ జే 7 మ్యాక్స్ 1000 రూపాయల తగ్గింపుతో ఇప్పుడు 16,990 రూపాయలకు లభిస్తుంది.  
షియెమీ రెడ్‌మీ నోట్ 4
షియోమీ నుంచి వ‌చ్చిన బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 4 పై 1000 రూపాయ‌ల ధ‌ర త‌గ్గించారు. ఇప్పుడు 3జీబీ ర్యామ్ వేరియంట్ 9,999 రూపాయ‌ల‌కు, 4జీబీ ర్యామ్ వేరియంట్ 11,999 రూపాయ‌ల‌కు ల‌భిస్తోంది. 
ఎల్‌జీ జీ6
ఎల్‌జీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ జీ6 51,900 రూపాయ‌ల ధ‌ర‌తో లాంచ్ అయింది. దీనిపై భారీగా 14వేల రూపాయ‌లుత‌గ్గించింది. ఇప్పుడు 37,990కు దొరుకుతోంది. 
* సోనీ ఎక్స్ పీరియా ఎక్స్ ఏ1 2వేలు ధర తగ్గి 17,990 రూపాయలకు,  ఎక్స్ ఏ1అల్ట్రా 2వేలు తగ్గి 27,990కి అందుబాటులో ఉంది.
* మోటో జీ5 ప్లస్ మీద కూడా 2వేలు ధర తగ్గింది. ప్రస్తుత  ధర  14,990
* జియోనీ ఏ1మీద 3వేల తగ్గింపుతో 16,999కు దొరుకుతోంది. 
* 4జీబీ ర్యామ్ తో వచ్చిన హానర్ 8 లైట్  2వేలు తగ్గింది. ప్రస్తుతం 15,999 రూపాయలకు కొనుక్కోవచ్చు.
 

జన రంజకమైన వార్తలు