• తాజా వార్తలు
  •  

వ‌ర‌ల్డ్ వైడ్ టాప్ సెల్లింగ్ మొబైల్ ఫోన్స్ ఏంటో తెలుసా? 

2017 చివ‌రికి వ‌చ్చేసింది.  ఈ ఏడాది కొన్ని వంద‌ల  మోడ‌ళ్ల స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వ‌ర‌ద‌లా వ‌చ్చేశాయి. 5వేల నుంచి మొద‌లుపెట్టి 60, 70 వేల రూపాయ‌ల ఖ‌రీదైన ఫోన్లు కూడా రావ‌డం, వాటిని జ‌నం కొని వాడేస్తుండ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోతోంది. ఇన్ని మోడ‌ల్స్ వ‌చ్చాయి క‌దా వీటిలో టాస్ సెల్లింగ్ ఫోన్లు ఏమిట‌ని IHS అనే రీసెర్చి సంస్థ రీసెర్చ్ చేసి ఓ లిస్ట్ రిలీజ్ చేసింది.  2017 తొలి ఆరు నెల‌ల్లో టాప్ 6 మొబైల్స్ ఏమిటో చెప్పింది. ఇందులో ఐఫోన్‌, శాంసంగ్‌ల‌కు మాత్ర‌మే చోటు ద‌క్కింది.  అంతేకాక గ‌త ఏడాది రిలీజ‌యిన ఫోన్లు కూడా ఉన్నాయి. 
`1. ఐఫోన్ 7
యాపిల్ గ‌తేడాది లాంచ్ చేసిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది తొలి ఆరు నెల‌లు కూడా టాప్ సెల్లింగ్ ఫోన్‌గా నిల‌వ‌డం ఐఫోన్‌కు  మార్కెట్లో ఉన్న క్రేజ్‌కు ఉదాహ‌ర‌ణ‌. 2016 అక్టోబ‌ర్లో లాంచ్ అయిన ఐఫోన్ 7.. ప్ర‌స్తుతం 49వేల రూపాయ‌ల ధ‌ర నుంచి దొరుకుతుంది. ఐఫోన్ 7లో 4.7 ఇంచెస్ రెటీనా డిస్‌ప్లే, క్వాడ్ కోర్ యాపిల్ ఏ10 ఫ్యూజ‌న్ ప్రాసెస‌ర్ దీని స్పెషాలిటీస్ 
2. ఐఫోన్ 7 ప్ల‌స్ 
రెండో ప్లేస్ కూడా యాపిల్‌దే.  ఐఫోన్ 7తో పాటు రిలీజ్ చేసిన ఐ ఫోన్ 7 ప్ల‌స్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 5.5 ఇంచెస్ రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ యాపిల్ ఏ10 ఫ్యూజ‌న్ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చిన ఈ ఫోన్ ధ‌ర 59 వేల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఐఫోన్ 7తో పోల్చితే ఇందులో వెన‌క‌వైపు 12 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్ ఉంది. 2x ఆప్టిక‌ల్ జూమింగ్ క్యాప‌బులిటీతో సూప‌ర్ ఫోటోస్ తీసుకోవ‌చ్చు.  
3. శాంసంగ్ గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ ప్ల‌స్ 
ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైన్ బ‌డ్జెట్ ఫోన్ ఇది. అయితే ఇండియాలో మాత్రం రిలీజ‌వ‌లేదు.  ర‌ష్యాలో గెలాక్సీ జే2 ప్రైమ్ పేరుతో వ‌చ్చింది. 5 ఇంచెస్ ఐపీఎస్ డిస్‌ప్లే క‌లిగిన ఈ ఫోన్‌లో మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్ ఉంది. 1.5, 2 జీబీ ర్యామ్ వెర్ష‌న్ల‌లో వ‌చ్చింది. 2600 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 8 ఎంపీ బ్యాక్‌, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాలున్నాయి. 
4. ఐఫోన్ 6 ఎస్ ప్ల‌స్ 
2016లో  హ‌య్య‌స్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డ్ సృష్టించిన ఐఫోన్ 6ఎస్‌ప్ల‌స్ ఈ ఏడాది కూడా టాప్ లిస్ట్‌లో ప్లేస్ కొట్టేసింది. ప్ర‌స్తుతం 40వేల రూపాయ‌ల నుంచి ల‌భిస్తున్నీ ఫోన్ యాపిల్ ఏ 9 ప్రాసెస‌ర్‌తో ర‌న్న‌వుతుంది. అంత‌కు ముందున్న ఏ8 చిప్‌సెట్‌తో పోల్చితే 70% ఫాస్ట్‌గా ఉండ‌డం దీనికి అడ్వాంటేజ్‌. 3డీ ట‌చ్‌, 2జీబీ ర్యామ్ ఉన్నాయి. 12 ఎంపీ ఐసైట్ రియ‌ర్ కెమెరాతో  4కే వీడియోస్ కూడా షూట్ చేయొచ్చు. ఫ్రంట్ 5 ఎంపీ కెమెరా ఉంది.  
5. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8
ఏప్రిల్ నుంచే షిప్పింగ్ మొద‌లుపెట్ట‌డంతో ఈ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల అమ్మ‌కాలు త‌క్కువ‌గా ఉన్నా త‌ర్వాత బాగా పుంజుకున్నాయి. ప్ర‌స్తుతం 50వేల పై ధ‌ర‌తో ల‌భిస్తున్న ఈ ఫోన్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్ల జాబితాలో 5వ స్థానంలో ఉంది. 
6. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ 
శాంసంగ్ గెలాక్సీ 8లోనే బిగ్ స్క్రీన్ వేరియంట్ ఇది.  
 

జన రంజకమైన వార్తలు