• తాజా వార్తలు

ఈ రోజు రిలీజ‌వుతున్న 1000 డాల‌ర్ల ఐ ఫోన్‌.. యాపిల్ ధైర్యానికి కార‌ణాలేంటి?

యాపిల్ ఈ రోజు (మంగ‌ళ‌వారం) కాలిఫోర్నియాలోని క్యూప‌ర్టిన్‌లో ఉన్న త‌న హెడ్ క్వార్ట‌ర్‌లో నిర్వ‌హించ‌బోయే ప్రోగ్రాంకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. 1000 డాల‌ర్లు (దాదాపు 68వేల రూపాయ‌లు) విలువ చేసే తొలి స్మార్ట్‌ఫోన్ గురించి రిలీజ్  చేస్తుంద‌ని  ఐఫోన్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.  అదే జ‌రిగితే స్మార్ట్ ఫోన్ ప్రైస్ 1000 డాల‌ర్ల ల్యాండ్ మార్క్‌ను రీచ్ అయినట్లే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విప‌రీత‌మైన కాంపిటీష‌న్ ఉన్నా కూడా యాపిల్‌.. ఐ ఫోన్ ధ‌ర త‌గ్గించ‌కుండా మోడ‌ల్ మోడ‌ల్‌కూ భారీగా పెంచుతోంది.  దీనికి కార‌ణాలేంటో చూడండి.. 

ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం యాపిల్ రిలీజ్ చేయ‌బోయే ఈ వెయ్యి డాల‌ర్ల ఫోన్ OLED స్క్రీన్ తో మ‌రింత షార్ప్ డిస్‌ప్లే నిస్తుంది.  ఎడ్జ్ టు ఎడ్జ్ (బీజిల్‌లెస్ ) స్రీన్‌ను తొలిసారిగా ఐఫోన్‌లో ఈ మోడ‌ల్‌తోనే  ఇంట్ర‌డ్యూస్  చేయ‌బోతున్నారు.  ఫేషియ‌ల్ రిక‌గ్నీష‌న్ టెక్నాల‌జీ, వైర్‌లెస్ ఛార్జింగ్‌, బెట‌ర్ కెమెరా ఉండ‌బోతున్నాయి. అయితే ఈ ఫీచ‌ర్ల‌న్నీ ఉన్న ఫోన్లు 50 వేల‌లోపే  కాంపిటీటివ్ కంపెనీలు ఇస్తున్న‌ప్పుడు ఐఫోన్కు 70 వేల రూపాయ‌లు ఎందుకు పెట్టాల‌నే ప్ర‌శ్న వ‌స్తుంది. అయితే ఫీచ‌ర్ ఒక‌టే అయినా యాపిల్ ఫోన్ల‌లో దాని పెర్‌ఫార్మెన్స్ మిగిలిన ఫోన్ల‌లో కంటే  చాలా సుపీరియ‌ర్‌గా ఉంటుంది కాబ‌ట్టే ఐఫోన్‌కు ప్రైస్ ఎక్కువైనా ఫ్యాన్స్ త‌గ్గ‌డం లేదంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు.  

యాపిల్ ఒక్క‌టే కాదు..
అయితే ఈ ప్రైస్ పెంచ‌డం అనేది యాపిల్ ఒక్క‌టే ఫాలో కావ‌డం లేదు. శాంసంగ్ త‌న గెలాక్సీ నోట్ 8కు 930 డాల‌ర్ల ధ‌ర పెట్టింది.   యాపిల్‌, శాంసంగ్ లాంటి కంపెనీల హై ఎండ్ ఫోన్లు వాడ‌డం ఒక స్టేట‌స్ సింబల్ అవ‌డం తో  ఇంత ప్రైస్ పెట్టినా అది ప్రాబ్లం కావ‌డం లేదు. 5వేల నుంచి కూడా స్మార్ట్‌ఫోన్ దొరుకుతుంది. కాబ‌ట్టి సామాన్యుడు కూడా వాడ‌గ‌లుగుతున్నాడు. కాబట్టి టాప్ కంపెనీల హైఎండ్ ఫోన్లు వాడ‌డానికే  కాస్త డ‌బ్బున్న‌వారు ప్రిఫ‌ర్ చేస్తున్నారు.  అందుకే హై ఎండ్ ల్యాప్‌టాప్ కంటే స్మార్ట్‌ఫోన్ ధ‌ర ఎక్కువైనా  అవ‌లీల‌గా కొంటున్నారు. ఫుడ్‌, సెక్స్ కంటే ఫోన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్లున్నార‌ని అందుకే ఎంత ప్రైస్  ఉంటే అంత క్రేజ్ అనే ట్రెండ్ పెరుగుతోంది. యాపిల్ కు చాలాకాలంగా ఎక్స్‌ప‌ర్ట్‌గా ఉన్న మన్‌స్ట‌ర్ మాట్లాడుతూ..  వ‌చ్చే ఏడాదిలోగా అమ్ముడ‌య్యే ఐఫోన్ల‌లో 20% ఈ 1000 డాల‌ర్ల ఐఫోన్ ఉంటుంద‌న‌డం మారుతున్న ట్రెండ్‌ను ప్ర‌తిబింబిస్తోంది.