• తాజా వార్తలు

రూ.10 వేల లోపు ఉన్న‌ బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్లు ఇవే

బ‌డ్జెట్‌లో ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను కొనాల‌ని అనుకుంటున్నారా! మీరేం ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. త‌క్కువ ధ‌ర‌లో మంచి టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి.  రూ.10 వేల లోపు ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో ఈ టాబ్లెట్లు దొరుకుతున్నాయి. మ‌రి అలా దొరుకుతున్న టాబ్లెట్లు ఏమిటో చూద్దామా..

శాంసంగ్ ఎస్ఎం-టీ116 ఎన్‌వైకేవైఐఎన్ఎస్‌
శాంసంగ్ ఎస్ఎం-టీ116ఎన్‌వైకేవైఐఎన్ఎస్ టాబ్లెట్ బాగా ప్రాచుర్యంలో ఉంది. 7 అంగుళాల ఈ టాబ్లెట్ ధ‌ర రూ.6999. క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్ ద్వారా ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ర‌న్ అవుతుంది. 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌తో పాటు 1 జీబీ ర్యామ్‌తో పాటు 5 ఎంపీ కెమెరా దీనిలో ఉంటుంది. 3600 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం దీనిలో ఉంది.

అల్‌కాటెల్ ఏ3
ఆండ్రాయిడ్ టాబ్లెట్ల‌లో బాగా ఖ‌రీదైన టాబ్లెట్ ఇది. దీని ధ‌ర 10.1 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ఇది ర‌న్ అవుతుంది. ఈ టాబ్లెట్ 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా ఇంకా ఎక్స్‌పెండ్ చేసుకోవ‌చ్చు. దీనిలో 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ షూట‌ర్‌తో పాటు 4600 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చింది ఇది. క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెస‌ర్ ఉంది.

స్వైప్ బ్లేజ్ 4జీ
స్వైప్ బ్లేజ్ లెవ‌ల్ ఎంట్రీ లెవ‌ల్ టాబ్లెట్‌.  దీని ధ‌ర రూ.4999. ఆండ్రాయిడ్ టాబ్లెట్ 6.0 మార్ష్‌మెల్లో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ద్వారా ప‌ని చేస్తుంది. ఇది క్వాడ్‌కోర్ స్ప్రెడ్ట్ర‌మ్ ప్రాసెస‌ర్ ద్వారా ప‌ని చేస్తుంది. 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఉంది. 1 జీబీ ర్యామ్‌తో పాటు 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. ఎస్‌డీ కార్డు ద్వారా మెమెరీ ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు. 

మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్
మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ 701 మోడ‌ల్ ధ‌ర రూ.6890.  దీనిలో 7 అంగుళాల డిస్‌ప్లే ఉంది దీనిలో. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఓఎస్ ద్వారా ఇది రన్ అవుతుంది. మెడిటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్ దీనిలో వాడారు. 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ  సామ‌ర్థ్యం ఉంది దీనిలో. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న ఈ డివైజ్‌లో 5 ఎంపీ కెమెరా వాడారు.