ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి స్మార్ట్ఫోన్లలో వన్‌ప్లస్ కూడా ఒకటి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వన్‌ప్లస్ మొబైల్స్ కూడా ఎప్పటికప్పుడు నాణ్యమైన ఫోన్లతో మార్కెట్లోకి వస్తోంది. తాజాగా ఆ కంపెనీ అలాంటి ఫోన్‌నే బరిలో దింపింది. ఆ ఫోనే వన్‌ప్లస్ 5. గతంలో వచ్చిన వన్‌ప్లస్ మోడల్స్ కన్నా దీనిలో ఉన్న ఫీచర్లు చాలా ఎక్కువే. అయితే వన్‌ప్లస్ 5తో సరితూగల ఫోన్ ఇంకోటి ఉంది అదే వన్‌ప్లస్ 3టీ. మరి వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 3టీ మధ్య ఏంటి వ్యత్యాసం?
గొరిల్లా గ్లాస్ 4.. గ్లాస్ 5
ఫీచర్ల విషయంలో వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 3టీ పెద్దగా డిఫెరెన్స్ కనిపించింది. ఈ రెండు ఫోన్లూ డ్యుయల్ సిమ్ స్లాట్ విత్ ఎక్సట్రనల్ కార్డ్ సపోర్ట్‌తో వచ్చాయి. స్క్రీన్ విషయంలోనూ పెద్ద తేడా లేదు. అదే 5.5 అంగుళాల ఆప్టిక్ అమోలెడ్ 2.5డి కర్వర్డ్ డిస్ప్లే. పిక్సల్స్ కూడా సమానమే. అయితే ఒకే ఒక్క తేడా ఏంటంటే గొరిల్లా గ్లాస్. వన్‌ప్లస్ 5 గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తే.. వన్‌ప్లస్ 3టీ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్‌తో వచ్చింది. అయితే బరువు విషయంలో వన్‌ప్లస్ 3టీ మోడల్‌తో పోలిస్తే వన్‌ప్లస్ 5 లైట్ వెయిట్. వన్‌ప్లస్ 5లో స్నాప్‌డ్రాగన్ 835 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో తయారు చేయగా.. వన్‌ప్లస్ 3టీని స్నాప్డాగన్ 821 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో రూపొందించారు.
కెమెరా భిన్నం
కెమెరా విషయంలో ఈ రెండింటికి చాలా తేడా ఉంది. వన్‌ప్లస్ 5 మోడల్లో 20 ఎంపీ మరియు 16 ఎంపీ డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీతో తయారు చేశారు. అదే వన్‌ప్లస్ 3టీ సింగిల్ 16 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉన్నాయి. వన్‌ప్లస్ 5ను 6 జీబీ ర్యామ్, 8 జీబీ రోమ్ ఉంటే, వన్‌ప్లస్ 3టీలో 64 జీబీ ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.1 రోమ్ ఉన్నాయి. వన్‌ప్లస్ 5లో ఉన్న మరో యునిక్ ఆప్షన్ ఏంటంటే 3 మైక్‌తో ఉన్న బ్లూటూత్. రెండింట్లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ రెండింట్లో ఉంది. ఆక్సిజెన్ ఎస్ రెండింట్లో సాఫ్ట్‌వేర్‌గా ఉపయోగించారు. అయితే బ్యాటరీ విషయంలోనే కాస్త తేడా ఉంది. వన్‌ప్లస్ 5 మోడల్‌ను 3300 ఎంఏహెచ్, డాష్ఛార్జీతో రూపొందిస్తే.. వన్‌ప్లస్ 3టీ మాత్రం 3400 ఎంఏహెచ్‌గా ఉంది. 3టీ మోడల్ ధర రూ.29,999గా ఉంటే... వన్‌ప్లస్ 5 ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది.