• తాజా వార్తలు

ట్రిపుల్ ఐటి లు-ఒక పరిచయం

సాధారణంగా ఏ విద్యార్థి కైనా ఐటి విద్య డిగ్రీ లో ప్రారంభం అవుతుంది.కానీ మన రాష్ట్ర విద్యార్థులకు మాత్రం అది పాఠశాల స్థాయి లో నే ప్రారంభం అవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయి లో దీని గురించి ఎవరూ పట్టించుకోక పోవడం.మన రెండు తెలుగు రాష్ట్రాలలోని ఏ ప్రభుత్వ ,ప్రైవేటు కళాశాలలు  కానీ లేదా ఏ పేరున్న  కార్పొరేట్ కళాశాల కానీ ఇంటర్మీడియట్ స్థాయి లో కంప్యూటర్ విద్యను భోదించడం లేదనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ లోటును పూరించడానికా అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల క్రితం ట్రిపుల్ ఐటి లను ప్రారంభించింది.పదవ తరగతి విద్యార్థులో మంచి మార్కులు సంపాదించిన మన విద్యార్థులు ఇంటర్మీడియట్ లోనికి అడుగు పెట్ట బోతున్న ఈ సంధర్భంలో ఈ ట్రిపుల్ ఐటి ల లో   సాంకేతిక విద్య గురించి ఒక్కసారి విశ్లేషిద్దాం.

పేరు లోనే టెక్నాలజీ ని నింపుకున్న ట్రిపుల్ ఐటి లు ఆంధ్ర తెలoగాణ రాష్ట్రాలలో మొత్తం మూడు ఉన్నాయి. ఆంధ్ర ప్రాతంలోని నూజివీడులోనూ తెలంగాణ లోని బాసర లోనూ రాయలసీమ లోని ఇడుపులపాయ లోనూ ఈ ట్రిపుల్ ఐటి లు ఉన్నయి.కొత్తగా హైదరాబాద్ లో కూడా ఒక ట్రిపుల్ ఐటి ని స్థాపించారు.ఈ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులకు వారి యొక్క సాధారణ సంప్రదాయ కోర్సులైన  గణితం సైన్సు లతో  పాటు కంప్యూటర్ విద్యను కూడా బోదిస్తారు.కోర్సులో ప్రవేశం పొందినప్పుడే ప్రతి ఒక్క విద్యార్థికీ ఒక ల్యాప్  టాప్  ను ఇస్తారు.దీని ధరను విద్యార్థులు తర్వాత తీర్చవలసి ఉంటుంది.ప్రత్యేకంగా  కంఫ్యూటర్  తరగతులు నిర్వహించబడ తాయి.మొదటగా కంప్యూటర్ లో బేసిక్స్ నేర్పిస్తారు.నిదానంగా కోర్సు పూర్తి అయ్యే సమయానికల్లా కంప్యూటర్  లో మాస్టర్ అయ్యే విధంగా ఐటి విద్యను బోధిస్తారు.

మానవ దైనందిన జీవితంలో ని ప్రతి విభాగం లో నూ కంప్యూటర్ అనేది ఒక విడదీయరాని బంధo గా మారిన ఈ రోజులలో కంప్యూటర్ విద్యను ఇంటర్మీడియట్ స్థాయి లోనే నిర్వహిస్తున్నరంటే అవి ఎంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలనే కదా అర్థం. అందుకే వాటిలో ప్రవేశానికి పోటీ ఎప్పుడూ తీవ్ర స్థాయిలో  ఉంటుంది.ఈ విద్యా సంస్థలలో ప్రవేశం పొందాలంటే కష్టపడి చదవడం ఒక్క్కటే మార్గం. కాబట్టి పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుని ట్రిపుల్  ఐటి ల లో ప్రవేశానికి పోటీ లో ఉన్న విద్యార్థులందరికీ మా అభిందనలు.వీరి స్ఫూర్థితో రాబొయే  విద్యార్థులు  కూడా కష్టపడి చదివి ట్రిపుల్  ఐటీ లలో ప్రవేశం సాధించి సాంకేతిక విద్యను అభ్యసించి సాంకేతికతో తమ జీవితాలను సార్థకం చేసుకుంటారని  ఆశిస్తూ..... కంప్యూటర్ విజ్ఞానం

                                                  A.దివ్య C.V.R, IIIT నూజివీడు

 

జన రంజకమైన వార్తలు