• తాజా వార్తలు
  •  

3 కోట్ల మందికి.. డిజిట‌లే ముద్దు

న‌వంబ‌ర్ 8న డీమానిటైజేష‌న్‌తో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌క‌టించిన సంచ‌లన నిర్ణ‌యం ఇండియాలో పేమెంట్స్ ముఖ‌చిత్రాన్నే మార్చేసింది. అప్ప‌టివ‌ర‌కు మెట్రోన‌గ‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు మారుమూల ప‌ల్లెల వ‌ర‌కు వెళ్లాయి. కొబ్బ‌రి బొండాలు, కూర‌గాయలు అమ్మేవాళ్లు కూడా పేటీఎం యాక్సెప్టెడ్ లాంటి బోర్డులు పెట్టుకున్నారు. క‌రెన్సీలో 85 శాతం ఉన్న 500, 1000 నోట్ల‌ను బాన్ చేయ‌డంతో దేశంలో క్యాష్‌కు విప‌రీత‌మైన కొర‌త ఏర్ప‌డింది. దీంతో విధిలేక జ‌నం డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లకు అల‌వాటు చేసుకున్నారు. క్రెడిట్‌, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌, పేటీఎం, ఫ్రీఛార్జి లాంటి మొబైల్ వాలెట్లు, యూపీఐలు వంటివ‌న్నీ వాడ‌డం అల‌వాటు చేసుకున్నారు. డీమానిటైజేష‌న్ దెబ్బ‌కు డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌కు దాదాపు 10 కోట్ల మంది కొత్త క‌స్ట‌మ‌ర్లు వ‌చ్చార‌ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రెండు రోజుల క్రితం చెప్పింది.
క్యాష్ ట్రాన్సాక్ష‌న్ల‌కు మ‌ళ్లినా..
అయితే జ‌న‌వ‌రి నెల నుంచి కొత్త 2000, 500 నోట్లు అందుబాటులోకి రావ‌డంతో క్యాష్ కొర‌త తీరింది. దీంతో చాలా మంది మ‌ళ్లీ క్యాష్ ట్రాన్సాక్ష‌న్ల‌కు మ‌ళ్లిపోయారు. గ‌త డిసెంబ‌ర్‌తో పోల్చుకుంటే డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు 9 శాతానికి పైగా తగ్గాయి. ఆ త‌ర్వాత నెల మ‌రో 21.3 శాతం క్షీణించాయి. అయినా స‌రే ఇప్ప‌టికీ మూడు కోట్ల మంది డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు చేస్తున్నార‌ని ఎన్‌పీసీఐ ప్ర‌క‌టించింది. ఇంత మంది డిజిట‌ల్ ట్రాన్సాక్షన్ల‌ను కొన‌సాగిస్తుండ‌డం సాధార‌ణ విష‌య‌మేమీ కాద‌ని ఎన్‌పీసీఐ ఛీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ దిలీప్ అస్బే చెప్పారు. సాధార‌ణంగా అయితే ఇంత పెరుగుద‌ల‌కు క‌నీసం రెండు, మూడేళ్లు ప‌డుతుంద‌ని.. డీమానిటైజేష‌న్ ప్ర‌భావంతో మూడు నెల‌ల్లోనే సాధ్య‌మైందని చెబుతున్నారు.
అవగాహ‌న, ఆక‌ర్ష‌ణ
ప్ర‌జ‌ల‌కు డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు అల‌వాటు చేయ‌గ‌లిగారు. కానీ వారు దాన్ని కొన‌సాగించాలంటే టెక్నాల‌జీ ప‌రంగా మ‌రింత ఈజీ ప్రాస్‌స్ రావాలి. ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుకున్న‌వాళ్లు కూడా దాన్ని చేయ‌గ‌లగాలి. ఇందుకు గ‌వ‌ర్న‌మెంట్ మ‌రింత గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో అవ‌గాహ‌న క‌ల్పించాలి. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు చేస్తే డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ల వంటివి పెట్టి ఆక‌ర్షించాలి. ఆధార్ పేతో రెండు వేల రూపాయ‌ల లోపు ట్రాన్సాక్షన్లు చేస్తే 0.25% క్యాష్ బ్యాక్ ఇవ్వ‌నున్నారు. ఇలాంటివి మ‌రింత పెంచాలి.

జన రంజకమైన వార్తలు