• తాజా వార్తలు
  •  

కేంద్ర బడ్జెట్.. ఐటీ రంగం - కంప్యూటర్ విజ్ఞానం విశ్లేషణ

కేంద్ర బడ్జెట్

ఐటీ రంగం

కంప్యూటర్ విజ్ఞానం విశ్లేషణ

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్ కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. దానికి అనుబంధంగా అనేక అంశాలకు ప్రాధాన్యత కనిపించింది. 2016 నవంబరు 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రజలందరికీ డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అవసరంగా మారాయి. దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దడానికి వీలుగా, డిజిటల్ లావాదేవీల దిశగా ఈ బడ్జెట్లో అనేక అడుగులు పడ్డాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంలో టెక్నాలజీని మరింతగా పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 డిజిటల్ ఎకానమీ దిశగా నిర్ణయాలు..
 - రూ. మూడు లక్షలకు మించి లావాదేవీలు చేయాలంటే ఇకపై కచ్చితంగా డిజిటల్ లావాదేవీలే చేయాలి. దేశంలో నల్లధనాన్ని అణచివేసేందుకు రూ. 3 లక్షలకు మించి నగదు లావాదేవీలను అనుమతించరాదని సిట్‌ కేంద్రానికి సిఫారసు చేసిన  సంగతి తెలిసిందే. ఈ సిఫారసును కేంద్రం ఆమోదించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి జైట్లీ వెల్లడించారు.
 - డిజిటల్ చెల్లింపులకు వీలుగా పిఒఎస్‌(స్వైపింగ్) యంత్రాలను, ఐరిస్‌ యంత్రాలను సుంకం విధింపునుంచి మినహాయించారు.
 - డిజిటలైజేషన్‌ ప్రోత్సహించే పరికరాలకు పన్ను మినహాయింపు
- ఆధార్‌ ఆధారిత పేమెంట్‌లు త్వరలో ప్రారంభం  
-మొబైల్‌, డెబిట్‌ కార్డులు లేకున్నా ఆధార్‌తోనే పేమెంట్‌ చేయవచ్చు
- సెప్టెంబర్‌​ 2017 నాటికి 20 లక్షల ఆధార్‌ బేస్‌డ్‌ చెల్లింపు కేంద్రాలు
 - వచ్చే ఏడాది రెండున్నర వేల కోట్ల నగదు రహిత లావాదేవీల లక్ష్యం
- భీమ్‌ యాప్‌ ను  కోటీ 25 లక్షలమంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. దీన్ని మరింత చేరువ చేయడం లక్ష్యం.

మొబైళ్లకు తీపిచేదు
 - మొబైల్‌ ఫోన్‌ సర్క్యూట్‌ బోర్డులపై 2 శాతం సుంకాన్ని విధించారు.
- మొబైల్‌ హ్యాండ్‌ సెట్ల తయారీ ప్లాంట్లకు ప్రోత్సహకాలు
- మొబైల్‌ పరిశ్రమ మౌలిక సదుపాయాలకు రూ.745కోట్లు
- ఆన్ లైన్లో రైలు టిక్కెట్ భారం తగ్గింది..
 ఐఆర్ సిటిసి ద్వారా రైల్వే టికెట్ల బకింగ్ పై సేవా పన్నులు పూర్తిగా రద్దు చేసినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు.

గ్రామాలకు ఇంటర్నెట్..
- భారత్‌ నెట్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కోసం రూ.10వేల కోట్లు

విద్యార్థులకు
- విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల విధానంలో బోధన చేసేందుకు వీలుగా ప్రయోగాత్మకంగా 350 ఆన్‌లైన్‌ క్లాసులు

ఇతర టెక్ నిర్ణయాలు..
 - దేశవ్యాప్తంగా 250 ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు. వీటి కోసం రూ.1.26లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
 - ఎలక్ట్రానిక్‌ తయారీ రంగంలో రూ.లక్ష 67వేలకోట్ల పెట్టుబడులతో 250 ప్రతిపాదనలు
- టెలికం ఫైబర్‌ యాక్టీవిటీ కనెక్టివిటీ కోసం రూ.5వేలకోట్లు

బడ్జెట్ తరువాత ధర తగ్గబోయే టెక్ పరికరాలు..
ఎల్ ఈడీ దీపాలు, మైక్రో ఎటీఎంలు, ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిస్ స్కానర్లు

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు