• తాజా వార్తలు
  •  

సెల్‌ట‌వ‌ర్ రేడియేష‌న్ ఎంతో తెలుసుకునేందుకు కొత్త వెబ్ సైట్

దేశంలో సెల్ ట‌వ‌ర్ల రేడియేష‌న్ ఉందో తెలుసుకోవ‌డానికి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఓ పోర్ట‌ల్‌ను లాంచ్‌చేసింది. త‌రంగ్ సంచార్ పేరుతో రూపొందిన ఈ పోర్ట‌ల్ ద్వారా సెల్ ట‌వ‌ర్ ఎల‌క్ట్రో మాగ్న‌టిక్ ఫ్రీక్వెన్సీ (ఈఎంఎఫ్‌) రేడియేష‌న్‌ను తెలుసుకోవచ్చు. సెంట్ర‌ల్ టెలికం మినిస్ట‌ర్ మ‌నోజ్ సిన్హా ఈ పోర్ట‌ల్‌ను లాంచ్ చేశారు. దేశంలో సెల్‌ట‌వ‌ర్ల రేడియేష‌న్ వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ఎలాంటి దుష్ప్ర‌భావం లేద‌ని ఆయ‌న చెప్పారు. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ 25వేల‌కు పైగా రీసెర్చ్‌లు చేసి ఈ విష‌యం తేల్చింద‌న్నారు.
4ల‌క్ష‌ల 40వేల ట‌వ‌ర్ల స‌మాచారం
త‌న ఇంటి స‌మీపంలో బీఎస్ఎన్ఎల్ ట‌వ‌ర్ ఉండ‌డం వ‌ల్ల రేడియేష‌న్‌తో త‌న‌కు క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని గ్వాలియర్‌లో ఓ వ్య‌క్తి కేసు వేయ‌డంతో సుప్రీంకోర్టు ఆ ట‌వ‌ర్‌ను ష‌ట్‌డౌన్ చేయాల‌ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఈ పోర్ట‌ల్ ద్వారా రేడియేష‌న్ స‌మాచారాన్ని అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించింది. ఇండియాలో 14.5 ల‌క్ష‌ల బేస్ స్టేష‌న్లు, నాలుగు ల‌క్ష‌ల న‌ల‌భై వేల ట‌వ‌ర్ల స‌మాచారం ఈ పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉంటుంది. టెలికం కంపెనీల‌న్నీ ఈఎంఎఫ్ స‌మాచారం, సంబంధిత డాక్యుమెంట్ల‌న్నీ ఈ పోర్ట‌ల్‌లో అప్‌డేట్ చేస్తాయి. ఎవ‌రైనా వినియోగ‌దారుడు ఏదైనా ట‌వ‌ర్ లేదా బేస్ స్టేష‌న్ వ‌ల్ల రేడియేష‌న్ దుష్ర్ప‌భావం ఉందా లేదా అని తెలుసుకోవ‌డానికి ఈ పోర్టల్ అవ‌కాశం క‌ల్పిస్తుంది. అయితే ఇందుకోసం 4వేల రూపాయ‌ల ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది.
స‌ర్వీస్ క్వాలిటీ డెవ‌ల‌ప్ చేసుకోవ‌డానికే
ఈ పోర్ట‌ల్‌లో ఉండే ఇన్ఫ‌ర్మేష‌న్‌ను టెలికం సేవ‌ల నాణ్య‌త మెరుగుప‌ర‌చ‌డానికే ప్ర‌ధానంగా ఉప‌యోగించుకోనున్న‌ట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ సోర్సెస్ చెబుతున్నాయి. సెల్‌ట‌వ‌ర్ల రేడియేష‌న్ వ‌ల్ల దుష్ప్ర‌భావం ఉంటుంద‌నే భ్ర‌మ‌ల నుంచి మ‌నం బ‌య‌ట‌ప‌డాల‌ని మినిస్ట‌ర్ చెప్పారు. గ్లోబ‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో కంపేర్ చేస్తే ప‌ది రెట్లు క‌ఠిన‌మైన రూల్స్‌ను ఇండియాలో అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌న‌కు కాల్‌డ్రాప్ కాకూడ‌దు.. కానీ ట‌వ‌ర్ మ‌న‌కు ద‌గ్గ‌ర‌లో ఉండ‌కూడ‌ద‌నే మ‌న‌స్త‌త్వాన్ని మార్చుకోవాల‌ని మినిస్ట‌ర్ కామెంట్ చేశారు.

జన రంజకమైన వార్తలు