• తాజా వార్తలు
  •  

4 ప్రభుత్వ వెబ్ సైట్లలో 13 కోట్ల మంది ఆధార్ డాటా పెట్టేశారు


- సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ స్టడీ సంచలన రిపోర్టు
- ప్రజల వ్యక్తిగత సమాచారం ఎంత మాత్రం సురక్షితం కాదా?


ఆధార్ డాటా లీకయ్యే ఛాన్సే లేదంటుంది కేంద్ర ప్రభుత్వం.. ఆధార్ ప్రాజెక్టును అంతా తానే అయి నడిపించిన నందన్ నీలేకనిదీ అదే మాట. ప్రజల విలువైన సమాచారానికి ఎలాంటి ఢోకా లేదనే చెబుతున్నారు అంతా. కానీ.. ప్రభుత్వ వెబ్ సైట్లలో మాత్రం ఆధార్ డాటా ఓపెన్ గా పెట్టేస్తున్నారు.
రీసెంటు జార్ఖండ్ లో పెన్షనర్ల కు సంబందించి.. ఛండీగఢ్లో సివిల్ సప్లయ్స్ కి సంబంధించి డాటా వెబ్ సైట్లలో పెట్టేశారు. చివరకు మోడీ డ్రీమ్ ప్రాజెక్టు స్వచ్ఛ భారత్ అభియాన్ వెబ్ సైట్లోనూ ఆధార్ బేస్డ్ గా డాటా లీకయిపోయింది.
సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ స్డడీ సంచలన రిపోర్డు ఇచ్చింది. దాని ప్రకారం 13.5 కోట్ల మంది ఆధార్ నంబర్లు, 10 కోట్ల బ్యాంకు ఖాతా నంబర్లు కేవలం నాలుగంటే నాలుగు ప్రభుత్వ పథకాల వల్ల వెల్లడయ్యాయని తేలింది. ఇందులో పింఛన్లు, ఉపాధి హామీ ప్రధానమైనవి.
లీకయితే ప్రమాదమేనా..
ఆధార్ నంబరు, దాని ఆధారంగా ఇతర డాటా లీకయితే అది కచ్చితంగా ప్రమాదకరమే. ఇప్పుడుఆధార్ అన్నిటికీ ఆధారమవుతోంది. ఫోన్ నంబరు, లైసెన్సులు, బ్యాంకు అకౌంట్లు, ఇన్కం ట్యాక్స్... ఆన్ లైన్ మనీ ట్రాన్సఫర్... ఇలా అన్నిటికీ ఆధార్ కీలకమవుతోంది. దీంతో ఆధార్ డాటా దొరికితే సైబర్ నేరగాళ్లు మన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేసే ప్రమాదం నుంచి ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయి.
అయిదో వంతు ప్రజల ఆధార్ డాటా లీకయిపోయింది...

కేవలం నాలుగు పథకాల వల్లే 13 కోట్ల మంది డాటా లీకవగా... మొత్తంగా దేశంలో 23 కోట్ల మంది ఆధార్ డాటా ఓపెన్ అయిపోయిందని తెలుస్తోంది.

- జాతీయ సామాజిక భద్రత పథకంలో 1,59,42,083 మంది ఆధార్ నంబర్లున్నాయి. వీటన్నిటికీ బ్యాంకు లేదా పోస్టాఫీస్ అకౌంట్లతో సీడింగ్ చేశారు. అంతేకాదు... అందులో వ్యక్తిగత సమాచారం చాలా ఉంది. ఈ వెబ్ సైట్లో డాటా డౌన్లోడ్ ఆప్షన్ ఉండడంతో ఎవరైనా ఇతరుల డాటా డౌన్లోడ్ చేసే ప్రమాదం ఉంది.
- ఉపాధి హామీలోనూ అదే పరిస్థితి. సుమారు 11 కోట్ల మంది ఆధార్ నంబర్లను బ్యాంకు అకౌంట్లు, పోస్టాఫీసు అకౌంట్లతో లింక్ చేశారు. ఇందులో సమస్త సమాచారం ఉంటోంది.

జన రంజకమైన వార్తలు