• తాజా వార్తలు
  •  

ఆధార్ స‌మాచారం లీక‌య్యే ప్ర‌సక్తే లేదు

ఆధార్ స‌మాచారం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లీక‌వ‌ద‌ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మ‌రోసారి స్పష్టం చేసింది. ఆధార్ న‌మోదు కోసం తీసుకున్న ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ లీక‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని అనుమానాలు చెల‌రేగుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ వివ‌ర‌ణ ఇచ్చింది. ఆధార్ నమోదు చేస్తున్న యూఐడీఐఏ వ్యవస్థ లోపరహితమైనది కాబ‌ట్టి ఆధార్ డిటెయిల్స్ బయటికి పొక్కే అవ‌కాశం లేద‌ని చెప్పింది. క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల‌లో వ‌చ్చిందంటూ త‌లెత్తిన వివాదంపై సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్పందించింది. సెంట్ర‌ల్ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయమంత్రి పీపీ చౌధరి లోక్‌సభలో దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఆధార్‌ వ్యవస్థ నుంచి వివరాలు బయటికి వెళ్లే ప్రశ్నే లేదని చెప్పారు. ధోనీ ఆధార్ రిజిస్ట్రేష‌న్ రిప్రంజెంటేటివ్‌ను ఇంటికి పిలిచి, ఆధార్ న‌మోదు ప‌త్రంతో ఫొటో ఫొటో దిగారని, ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో కనిపించినంత మాత్రాన ఆధార్ వివ‌రాలు లీక‌యిన‌ట్లు కాద‌ని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా యూఐడీఐఏ వ్య‌వ‌స్థ‌ల‌ను డిజైన్ చేశామ‌ని, అందువ‌ల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ ఆధార్‌, బయోమెట్రిక్ వంటి వివ‌రాలు లీక‌వ‌లేదన్నారు. అంతేకాదు.. ఆధార్‌ వివరాల‌ను వెల్ల‌డించవద్ద‌వ‌ని వాటిని తీసుకుంటున్న ఆర్గ‌నైజేష‌న్లు, బ్యాంకుల‌కు ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ ఇచ్చామ‌ని చెప్పారు. కాబ‌ట్టి ఆధార్ స‌మాచారం లీక‌వుతుంద‌నే సందేహాలు అక్క‌ర్లేద‌ని మినిస్ట‌ర్ ప్ర‌క‌టించారు.

జన రంజకమైన వార్తలు